హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Mirchi Farmers: అన్నం పెట్టే రైతుల్ని మోసం చేస్తావా..? నీకు మనసెలా వచ్చిందయ్యా..?

Mirchi Farmers: అన్నం పెట్టే రైతుల్ని మోసం చేస్తావా..? నీకు మనసెలా వచ్చిందయ్యా..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మిర్చి రైతులకు ఎప్పుడూ కష్టాలే.. ప్రకృతి వైపరీత్యాలు తో తలమునకలవుతున్న మిర్చి రైతులకు (Mirchi Farmers) ఈసారి వైరస్ రూపంలో పెనుసవాళ్లు ఎదురయ్యాయి.అన్నికష్టనష్టాలను భరించి పంట పండించిన రైతులను దళారులు ముంచేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Anna Raghu, News18­, Guntur

  ఎవరైనా అర్ధిక కష్టాల్లో ఉంటే మంచి వ్యాపారమో, ఉద్యోగమో చేస్తే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. ఈ రెండింటిలో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. కానీ రైతులకు మాత్రం ఎంత కష్టపడినా తగినంత ఫలితం ఉండదు. ధర ఉండే డిమాండ్ ఉండదు.. పంటలు పండి అంతా బాగుంటే ధర ఉండదు. చినుకుపడినా, ఎండ పెరిగినా ఆరుగాలం కష్టించినందంతా వృథా అయిపోతుంది. అంత కష్టపడి పంట చేతికొచ్చినా, ధర ఉన్నా మధ్యలో దళారీ ఎంటరవుతాడు. రూపాయో, రెండు రూపాయలో తగ్గినా రైతులు అతడిగే పంటను విక్రయించి డబ్బుకోసం ఆశగా ఎదురుచూస్తాడు. కానీ కొందరు దళారులు మాత్రం కాలనాగులా అన్నదాతలను కాటేస్తున్నారు. రక్తాన్ని చెమటగా చిందించి పండించిన పంటను మాయమాటలతో దోచేస్తున్నారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మిర్చి రైతులకు ఎప్పుడూ కష్టాలే.. ప్రకృతి వైపరీత్యాలు తో తలమునకలవుతున్న మిర్చి రైతులకు ఈసారి వైరస్ రూపంలో పెనుసవాళ్లు ఎదురయ్యాయి. ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి దిగుబడి తగ్గింది కొన్ని చోట్ల వైరస్ కారణంతో పూర్తిగా తుడిచి పెట్టుకొనిపోయాయి. ఇన్ని కష్టనష్టాలను ఎదుర్కొని పండించిన రైతుకు దళారుల దెబ్బతో కుదేలైపోతున్నారు. ఆరుగాలం కాయకష్టం చేసి పంటపండించిన రైతన్నలకు దళారులను నమ్మి నట్టేట మునిగిపోతున్నారు.

  ఇది చదవండి: అక్రమ మద్యంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రెండు వారాల్లో 3వేల కేసులు..

  అలాంటి సంఘటన ప్రకాశం జిల్లా (Prakasham District) కారంచేడు మండలంలో జరిగింది. కేసవరప్పాడుకు చెందిన కొడవలి హరీష్.. మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. అతడ్ని నమ్మి పరిసర గ్రామాల రైతుల భారీగా మిర్చిని విక్రయించారు. అమాయక రైతులన నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న అతగాడు డబ్బు ఇవ్వకుండా దారుణంగా మోసం చేశాడు. పంట డబ్బుల కోసం రైతులు ఒత్తిడి చేస్తుండటంతో చేస్తుండటంతో కోల్డ్ స్టోరేజ్ లో మిర్చిని ఉంచానని మార్కెట్లో ధర పెరుగుతుందని వారిని నమ్మిస్తూ వచ్చాడు.

  ఇది చదవండి: రోజుకో క్వార్టర్ మందు, సిగరెట్ తాగుతా..! టీచర్లకు స్టూడెంట్ లేఖ.. ఏపీ ప్రభుత్వ స్కూల్లో షాకింగ్ ఘటన..

  కొందరు రైతులకు కోల్డ్ స్టోరేజీ రసీదులు కూడాచూపించాడు. ఐతే ఇంతకీ డబ్బు ఇవ్వకపోవటం తో కొంత మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ వద్దకు వెళ్లి రసీదులు చూపించి ఆరా తీయగా వారికి షాకింగ్ సమాధానం ఎదురైంది. ఆ రసీదులు నకిలీవని తేలడంతో ఆశ్చర్యపోయిన రైతులు హరీష్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతడు పరారరయ్యాడు. మూడు రోజులుగా అతడి ఆచూకీ లేకపోవడంతో రైతులంతా అతడి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: ఛీఛీ వీడు మొగుడేనా..? అన్నతో ఆ పనిచేయాలని భార్యకు టార్చర్.. చివరికి ఏమైందంటే..!

  హరీష్ చేతిలో మోసపోయానన్న ఆందోళనతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రైతుల్లో రూ.50 వేల నుంచి రూ.30 లక్షల వరకు అతడికి పంటను విక్రయించి మోసపోయిన వారున్నారు. హరీష్ దాదాపు రూ.3.50 కోట్ల మేర రైతులకు కుచ్చుటోపీ వేసినట్లు తెలుస్తోంది. తామంతా కౌలు రైతులమని.. అప్పులు తెచ్చి మరీ మిర్చి పండిస్తే అతడు మాత్రం దారుణంగా మోసం చేశాడని రైతులు వాపోతున్నారు. దయచేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Cheating, Farmers, Prakasam

  ఉత్తమ కథలు