Liquor Smugglers Creative thinking: ఆంధ్రప్రదేశ్ (andhra pradesh )లో మద్యం మాఫియా పోలీసులకు సవాల్ విసరుతోంది. నిత్యం అక్రమ మద్యాన్ని (Liquor smuggling) ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలిస్తూనే ఉన్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి.. జాగ్రత్తలు తీసుకున్నా అక్రమ మద్యం ఆగడం లేదు. ఓ సారి మద్యం అక్రమంగా సరఫరా చేసి దొరికితే భారీగానే కేసులు పెడుతున్నారు. మరోసారి అలా జరగకుండా ఉండేందుకు ఆయ ప్రాంతాల్లో పటిష్ట నిఘా పెట్టారు. మద్యం మాఫియా సభ్యులను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నా.. ఈ అక్రమ మద్యం రావాణాకు బ్రేకులు పడడం లేదు. పైగా పోలీసులకు ధీటుగా కొత్త కొత్త ఆలోచనలతో దూకుడు చూపిస్తున్నారు. పోలీసు (Police)లకే సరికొత్త సవాళ్లు విసురుతున్నారు. అందుకే ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమ మద్యం రవాణా మాత్రం బ్రేకులు పడడం లేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అక్రమార్కులు పలు మార్గాల్లో మద్యం తరలిస్తూ పట్టుబడుతూనే ఉన్నారు.
తాజాగా ఏపీ పోలీసులు జరిపిన తనిఖీల్లో తెలంగాణ (Telangana) నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే వారి తెలివి తేటలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇన్ని తెలివితేటలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు. పోలీసులకు పట్టు బడకుండా ఉండేందుకు ఇన్ని క్రియేటివ్ థాట్స్ ఎవరిస్తున్నారో అని ఆలోచిస్తున్నారు. అసలు ఈ సారి నిందితుల ప్లాన్ చూసి పోలీసులే షాకయ్యారు. ట్రాలీ ఆటోలో ప్రత్యేకంగా అరలు తయారు చేసి.. ఎవరికీ అనుమానం రాకుండా దర్జాగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు రెండు ట్రాలీ ఆటోలను ఆపి తనిఖీలు నిర్వహించగా.. వారి ప్లాన్ కాస్త రివర్స్ అయింది. ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న 400 మద్యం బాటిళ్లను జి.కొండూరు మండలంలోని కందులపాడు అడ్డరోడ్ వద్ద ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
#Liquor Smuggling|| అమ్మో వీళ్ల తెలివి మామూలుగా లేదు || పోలీసుల కన్ను కప... https://t.co/OQtZZnciKJ via @YouTube #Liquorose #liquoroseatwittertopic @Liquor @Liquorland
— nagesh Journlist (@nageshzee) December 7, 2021
ఖమ్మం నుంచి విజయవాడ కొత్తూరు తాడేపల్లికి అక్రమంగా తెలంగాణ మద్యాన్ని తరలిస్తుండగా.. ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. అనుమానంతో రెండు ట్రాలీ ఆటోలను ఆపి పరిశీలించారు. ఆటో ట్రక్కులో ప్రత్యేకంగా అరను ఏర్పాటు చేసి కేటుగాళ్లు మద్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రెండు ఆటో ట్రాలీలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు లక్ష రూపాయల పైనే ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి : రోడ్డుపై గర్భిణీ అవస్థలు.. చలించి పోయిన చిన్నారి.. ఏం చేసిందంటే..? వీడియోలో చూడండి
అయితే ముఖ్యంగా అక్రమ రవాణా పెరగడానికి ఏపీలోమద్యం ధరలే కారణమంటున్నారు మందుబాబులు.. మంచి బ్రాండులు దొరకడం లేదు. దానికి తోడు.. రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. అందుకే ఇలా ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం వస్తోంది అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక నుంచి భారీగా మద్యం బాటిళ్లను తరలించి క్యాష్ చేసుకుంటున్నారు. అయితే.. అక్రమ మద్యంపై ఏపీ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేయడంతో.. వారి ఐడియాలు రివర్స్ అవుతున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Liquor, Liquor ban