హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఈ నెల 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత.. కలెక్టర్ ఆదేశాలు.. ఎక్కడంటే..?

Andhra Pradesh: ఈ నెల 18, 19 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేత.. కలెక్టర్ ఆదేశాలు.. ఎక్కడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ప్రాంతంలో 18, 19 తేదీల్లో మద్యం దుకాణలను మూతపడనున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయించాలని జిల్లా కలెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ప్రాంతంలో 18, 19 తేదీల్లో మద్యం దుకాణలను మూతపడనున్నాయి. ఆ రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయించాలని జిల్లా కలెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. ఇంతకీ మద్యం దుకాణాలు (liquor Shops) మూసివేత ఎక్కడని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరి చదవాల్సిందే. ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ పైడి తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు (Pydithallamma jatara) ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 18వ తేదీన తొలేల్ల ఉత్సవం, 19న సిరిమానోత్సవం (Sirimanothsavam) నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఉత్సవాలను సంబంధించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

పైడి తల్లి అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 18, 19వ తేదీల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ (Vizianagaram Municipal Corporation) పరిధిలో ఉన్న, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని (liquor Shops to be closed) ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌ ఎ సూర్యకుమారి (A.Suryakumari IAS) ఆదేశించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో కార్పొరేషన్‌ పరిధిలోని ఉన్న, నగరానికి సమీపంలో గల మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెండు రోజులు అధికారులు తనిఖీలు చేపట్టాలని, నిబంధనలను అమలు చేయాలని సూచించారు.

Bhoomi Trivedi: ప్రముఖ సింగర్‌ భూమి‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు.. మరో సింగర్ రాహుల్‌పై కూడా.. కేసు ఏమిటంటే..

కోవిడ్ నేపథ్యంలో..

కోవిడ్ నేపథ్యంలో గతేడాది నిర్వహించిన విధంగానే ఈ ఏడాది కూడా సిరిమానోత్సవాన్ని నిర్వహేందుకుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలు, భక్తులు కోవిడ్ నిబంధనలు దృష్టిలో ఉంచుకుని ఇళ్లకే పరిమితం కావాలని నగర డీఎస్పీ అనిల్‌కుమార్ విజ్జప్తి చేవారు. దూరప్రాంతాల నుంచి భక్తలు రాకుండా ముందస్తుగా గ్రామాల్లో అనౌన్స్‌మెంట్‌లు చేస్తున్నట్టుగా చెప్పారు. మరోవైపు పైడి తలమ్మ, సిరిమాను సంబరాలను ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లపై శనివారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.

First published:

Tags: Andhra Pradesh, Liquor shops, Vizianagaram

ఉత్తమ కథలు