LIQUOR SHOCK IN ANDHRA PRADESH MAN BUY A WINE BOTTLE AFTER DRINKING GET VOMITING AND MOTIONS NGS
AP Liquor: మద్యం బాటిల్ ఓపెన్ చేస్తే షాక్.. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడని తాగితే.. ఏం జరిగిందో తెలుసా?
మందు బాటిల్లో పురుగులు చెత్తా చెదారం
Andhra Pradesh Liquor: మద్యం బాటిల్ కొని స్నేహితుడికి గిఫ్ట్ ఇచ్చాడు. స్నేహితుడు ప్రేమగా ఇచ్చాడని బాటిల్ ఓపెన్ చేసి తాగిన కాసేపటికే ఆ వ్యక్తికి వాంతులు, విరోచనాలు భయ పెట్టాయి. ఇంతకీ ఏం జరిగింది..?
Andhra Pradesh Liquor: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (andhra pradesh government) అంటేనే మందుబాబులు (Liquor lovers) మండిపడుతున్నారు.. ఏపీలో ప్రభుత్వం మద్యం షాపులపై విమర్శలు ఆగడం లేదు. రోజుకో ఆరోపణ తెరపైకి వస్తోంది. మద్యం నిషేధం పేరు చెప్పి.. వైన్ షాపులను (Wine shops) తగ్గించేశారు.. రేట్లు పెంచితే మందు తాగే వారి సంఖ్య తగ్గుతుంది అంటూ బారీగా ధరల(High Rates)ను పెంచింది ప్రభుత్వం. మందుబాబులు నో అంటూ అదే స్థాయిలో మద్యం సేవిస్తున్నారు. వీటన్నింటికీ తోడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా మంచి బ్రాండ్ లు అందుబాటులో ఉండడం లేదన్నది మందు తాగే వారి ప్రధాన డిమాండ్. చెత్త చెత్త బ్రాండ్లను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా మరో అంశం మందుబాబులకు షాక్ ఇఛ్చింది. బాటిల్ ఓపెన్ చేస్తేనే షాక్ తినాల్సి వస్తోంది.
ఓ మద్యం సీసాలో పురుగులు, చెత్తాచెదారం ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని గమనించకుండా సీసాలో మద్యం సేవించిన ఓ వ్యక్తి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. తెనాలిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది అని చెప్పాలి. తెనాలిలోని నందుల పేటకు చెందిన కిషోర్ అనే వ్యక్తి ప్రభుత్వ మద్యం షాపులో ఓ మద్యం సీసాను కొనుగోలు చేశాడు. అలా కొన్న ఆ బాటిల్ ను కిషోర్ తన స్నేహితుడికి బహుమతిగా ఇచ్చాడు. బాటిల్‌ను సరిగ్గా గమనించని కిషోర్ స్నేహితుడు మద్యాన్ని కొంత సేవించాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా వాంతులు, విరేచననాలతో బాధపడి అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు.
విషయం తెలుసుకున్న కిషోర్.. మద్యం బాటిల్‌ను గమనించే సరికి అందులో చెత్తాచెదారం, పురుగులు ఉండడాన్ని గమనించాడు. వెంటనే ఆ మద్యం బాటిల్ పట్టుకుని.. కొన్న మద్యం దుకాణానికి వెళ్లిన కిషోర్ అనే వ్యక్తి.. ఈ విషయాన్ని సంబంధిత దుకాణం సిబ్బందిని కలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కిషోర్ ఆవేదన విన్న మద్యం షాపు సిబ్బంది తాము కేవలం ఉద్యోగులమేనని తాము చేసేది ఏమీ లేదని చెప్పారు. అయితే ఆయన ఫిర్యాదును అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక ఈ విషయమై కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల్లోని మద్యంలో ఇలా చెత్తాచెదారం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. తన్న స్నేహితుడికి ఏమైనా అయితే పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అని, పూర్తి పరిశీలన చేయకుండా ఇలాంటి వాటిని ఎందుకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయం తెలసిన మద్యం ప్రియులు మద్యం సేవించే ముందు ఒకటికి రెండు సార్లు బాటిల్‌ను చెక్ చేసుకోవాలని భావిస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.