హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Liquor: ఏపీలో కొత్త మద్యం రేట్లు ఇవే.. ఆనందంతో మందుబాబుల చిందు.. నిషేధమంటూ తగ్గింపేంటని విపక్షాల ప్రశ్న

AP Liquor: ఏపీలో కొత్త మద్యం రేట్లు ఇవే.. ఆనందంతో మందుబాబుల చిందు.. నిషేధమంటూ తగ్గింపేంటని విపక్షాల ప్రశ్న

ఫైల్ ఫోటో..

ఫైల్ ఫోటో..

AP Liquor Rates: గతంలో మందుబాబులకు వరుస షాక్ లు ఇస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. వారు చేస్తున్న హంగామా ఇప్పుడు వైరల్ అవుతోంది. మరోవైపు ప్రభుత్వం తీరుపై విపక్ష నేతలు, మహిళలు మండిపడుతున్నారు.

ఇంకా చదవండి ...

AP Liquor Rates: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మందుబాబు తొలిసారి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. . రాష్ట్రంలోని మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు జగన్ సర్కార్ (Jagan Government) కీలక ఆదేశాలు జారీ చేస్తూ  శుభవరార్త  (Good News)చెప్పింది.  ధరల్లో మార్పులు (Liquor Rates)చేయడంతో మద్యం బాబులకు పండగే. మద్యం ప్రియులు పండగ చేసుకోడానికి అసలు కారణం మద్యం ధరలు తగ్గిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (Andhra Pradesh Government) నిర్ణయం తీసుకోవడమే. దీంతో తొలిరోజే మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. అంటే వారు ఎంత జోష్ లో ఉన్నారో ఊహించవచ్చు.

తగ్గిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. వ్యాట్‌, ఎక్సైజ్‌ డ్యూటీ మార్జిన్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇండియన్‌ మేడ్‌ఫారిన్‌ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించింది. అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలను తగ్గించింది. ఐఎంఎల్‌ లిక్కర్‌పై వ్యాట్‌ 35 నుంచి 50 శాతం వరకు తగ్గింది. స్పెషల్‌ మార్జిన్‌ 10 నుంచి 20 శాతం, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ 5 నుంచి 26 శాతం వరకు తగ్గించింది ప్రభుత్వం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యం, నాటుసారా తయారీని అరికట్టేందుకు ధర తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి : ఊ అంటావా మామా పాటకు మేల్ వెర్షన్ విన్నారా..? కౌంటర్ మామూలుగా లేదుగా

ప్రభుత్వం మద్యం ధరలలో మార్పులు చేయడంతో మద్యం బాబులకు పండగే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మందుబాబులు సంబరాలు చేసుకున్నారు. ప్రకాశంజిల్లా సింగరాయకొండలో మద్యందుకాణం ముందు మందుప్రియులు హారతులు పట్టి కొబ్బరికాయులు కొట్టి తమ ఆనందం వ్యక్తం చేశారు. పాటలు పాడుతూ మద్యం మత్తులో తూగుతూ తగ్గించిన ధరలతో మద్యం తాగుతుంటే ఆ కిక్కే వేరప్పా… అంటూ హారతులు పట్టారు. తరువాత కొబ్బరికాయ కొట్టి మద్యం దుకాణంలోకి ఆడుగుపెట్టారు. ఆనందం వచ్చినా.. ఆగ్రహం వచ్చినా.. మందుబాబులను కట్టడి చేయలేం.. సింగరాయకొండలో అదే జరిగింది. ఎంతైనా టాక్స్‌ పేయర్స్ం తామే కదా అంటున్నారు మందుబాబులు.ఓ వైపు మందుబాబులు ఆనందంతో చిందులు వేస్తుంటే.. ప్రభుత్వం తీరుపై మహిళలు, విపక్షాలు మండిపడుతున్నాయి. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి ధరలు తగ్గించడంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నిస్తున్నాయి. మద్యంపై 30 శాతం వ్యాట్ చార్జీలు తగ్గించడం చూస్తే ఏమి అర్దం చేసుకోవాలి అంటున్నారు. మద్యంపైవచ్చే ఆదాయంతోనే సంక్షేమపథకాలు అమలు చేయడం చాలా బాధాకరమని టీడీపీ నేత అనిత ఆవేదన వ్యక్తం చేశారు. వాకిన్ స్టోర్స్ చెప్పి 300 షాపులు తరెవబోతున్నారు... తాళిబొట్లు తెగిపోయే దుస్ధితి మద్యం వల్లే ఏర్పడుతోంది.. గంటకు పదికోట్లు అమ్మాలని ఐఏఎస్ లకు టార్గెట్లు నిర్ణంచడం దారుణమన్నారు ఆమె..

ఇదీ చదవండి : కూతురితో కలిసి మంత్రి అదిరే స్టెప్పులు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ప్రత్యేకత ఏంటో తెలుసా..?

మద్యం విక్రయాలతో నెలకు 6 వేల కోట్లు జగన్ జేబులోకి వెళుతున్నాయని..మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు అమలు చేయడంలేదని అనిత ప్రశ్నించారు. భర్త తాగుడుకు ఖర్చు చేసే డబ్బులనే తిరిగి అమ్మ ఒడిపేరుతో డబ్బులిస్తున్నారు.. చీప్ లిక్కర్లు తాగి ప్రాణాలు కోల్పోతున్నారుని..  గంజాయి ఇతర మత్తుపదార్ధాలవైపు ప్రజలు వెళ్లకుండా వుండటంకోసమే మద్యంధరలు తగ్గించామని ఓ అధికారి చెప్పడం దేనికి సంకేతమని నిలదీశారు. నాటు సారా కాస్తోంది,గంజాయి రవాణా చేస్తోంది వాలంటీర్లే అని ఆమె ఆరోపించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, Liquor policy, Tdp

ఉత్తమ కథలు