LIQUOR AND NON VEG RECORD SALES IN ANDHRA PRADESH FOR SANKRANTI FESTIVAL TIME MORE RS 32 CRORE LIQUOR SALES NGS VSP
Liquor Sales: పండుగ కిక్కే వేరప్ప.. ఐదు కోట్ల మాంసం.. 32 కోట్ల మద్యం.. ఎక్కడో తెలుసా?
ఏపీలో లిక్కర్ అమ్మకాలు
Liquor Sales In Andrha Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజల పెద్ద పండుగ మరో రికార్డు క్రియేట్ చేసింది. ఈ పండుగ రోజుల్లో ఎవరూ ఊహించని విధంగా 32 కోట్ల రూపాయల మద్యం.. ఐదు కోట్ల రూపాయల మంసం విక్రయాలు జరిగాయి.. ఇది ఎక్కడో తెలుసా?
P Anand Mohan, Visakhapatnam, News18 Liquor, chicken and mutton sales Record In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు ఘనంగా చేసుకునే పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti).. మూడు రోజుల పాటు ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. పట్టణం పల్లె అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో సంబరాలు కనిపిస్తాయి. అయితే ఈ సారి సంక్రాంతి ఆనందం పతాకస్థాయికి చేరింది. చాలామందికి వర్క్ ఫ్ర్రం హోం ఉండడం.. స్కూళ్లకు సెలవులు.. ఇటీవల కరోనా నేర్పిన పాఠాలతో.. సొంతవారికి దగ్గరగా ఉండాలనే భావనతో ఎక్కువంది పట్నాలు వీడి.. పల్లె బాట పట్టారు. దీంతో గతంతో పోలిస్తే ఈ సారి సంక్రాంతికి అదుర్స్ అనిపించింది. ముఖ్యంగా సంక్రాంతి తరువాత వచ్చే కనుమ (Kanuma) రోజు మాంసం, మద్యం ప్రియుల (Liquor Lovers) జోష్ ఓ లెవల్ కు చేరింది. మందు, విందుతో సందడి చేశారు.
ముఖ్యంగా సంక్రాంతి, కనుమ రెండు రోజులూ మద్యం దుకాణాల ముందు మద్యం ప్రియులు భారీగా క్యూ కట్టారు. ఓ వైపు అదివారం అందులోను కనుమ రోజు.. దీంతో విశాఖపట్నం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా షాపులు తెరవకముందు నుంచే మద్యం కోసం మందుబాబులు ఎగబడ్డారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 266 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 119 బార్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఆనందపురం (డిపో-1), జెర్రిపోతులపాలెం (డిపో-2), అనకాపల్లిలోని ఐఎంఎల్ డిపోల ద్వారా మద్యం సరఫరా అవుతుంటుంది. సాధారణ రోజుల్లో అయితే మూడు డిపోల పరిధిలో రోజుకి 6 కోట్ల రూపాయల విలువైన మద్యం సరఫరా అవుతుండగా, సంక్రాంతి సందర్భంగా ఇండెంట్కు మించి సరుకుని దుకాణాలకు సరఫరా చేశారు. ఎక్సైజ్ అధికారుల లెక్కలమేరకు కేవలం శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా 32 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు సాగాయి.
అటు చికెన్ దుకాణాల ఎదుట భారీ క్యూలు కనిపించాయి. కనుమ సందర్భంగా ఆదివారం మాంసం విక్రయాలు జోరుగా సాగాయి. జిల్లాలో సుమారు ఏడులక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగాయి. ఇవి కాకుండా మరో 50 వేల కిలోల వరకు నాటుకోళ్ల అమ్మకాలు సాగాయని బ్యాగ్ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు తెలిపారు.
అలాగే మటన్ సుమారు 50వేల కిలోల వరకు విక్రయించినట్టు వ్యాపారులు చెబుతున్నారు. నగరంలో మటన్ కిలో 800 రూపాయల వరకు అమ్మకాలు చేపట్టగా, గ్రామీణ ప్రాంతంలో కొన్నిచోట్ల కిలో వెయ్యి వరకు కూడా అమ్ముడయిందని లెక్క.. దీని ప్రకారం 4.25 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరిగి ఉంటుందని అక్కయ్యపాలెంనకు చెందిన మస్తాన్ ఖాజీ తెలిపారు. వీటికితోడు చేపల వ్యాపారం జోరుగా సాగింది. ఫిషింగ్ హార్బర్లో చేపలు కొనేందుకు వినియోగదారులు పొటెత్తారు. నగరంలో పలుచోట్ల చేపలబజార్లు కిక్కిరిసిపోయాయి.
మొత్తానికి పండగల పసందు కనుమ విందుతో ముగిసింది. కనుమ, పైగా ఆదివారం కావడంతో మాంసాహార విక్రయాలు భారీగా పెరిగాయి. జిల్లాలోని పట్టణం, గ్రామాలన్న తేడా లేకుండా అన్ని చోట్లా మాంసాల కొనుగోళ్లతో ఆ దుకాణాలు రద్దీగా మారాయి. మాంసం కొనుగోళ్లకు డిమాండ్ ఉండడంతో అమ్మకందారులు ధరలను పెంచేశారు. కిలో మటన్ సంక్రాంతి పండగకు ముందు 850 ఉంటే, కనుమ రోజున దాదాపు వేయి వరకు విక్రయించారు. కోడి మాంసం ధర కిలో 150 సుమారు 200ల వరకు పెంచి విక్రయించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.