తిరుపతిలో భారీగా మద్యం, మాంసం.. అలిపిరిగేట్టు వద్ద పట్టుకున్న సిబ్బంది..

అలిపిరి గేటు వద్ద పట్టుబడిన మద్యం, మాంసం

ఓ వ్యక్తి తన కారులో 11 లీటర్ల మద్యం, ఐదు కిలోల చికెన్‌ను తిరుమల కొండపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో మద్యం, మాంసం బయటపడడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

  • Share this:
    తిరుపతిలో 11 లీటర్ల మద్యం, ఐదు కేజీల మాంసాన్ని కారులో తరలిస్తున్నారన్న విషయం స్థానికంగా కలకలం సృష్టించింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్నఓ వ్యక్తి తన కారులో 11 లీటర్ల మద్యం, ఐదు కిలోల చికెన్‌ను తిరుమల కొండపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో మద్యం, మాంసం బయటపడడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 5 కిలోల చికెన్‌, సిగ్నేచ‌ర్ విస్కీ - 4 బాటిళ్లు, ఓట్కా - 2 బాటిళ్లు, లూజ్ లిక్క‌ర్ - 2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమ‌ల‌లోని 2 టౌన్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు. కాగా, సదరు నిందితుడిపై గ‌తంలో న‌మోదైన ఒక కేసు ప్ర‌స్తుతం విచార‌ణలో ఉంది. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుంటే.. అసలు కారులో కొండపైకి మద్యం, మాంసం తీసుకెళ్లుందుకు ప్రయత్నించడం భక్తులకు పలు అనుమానాలకు తావిస్తోంది.
    Published by:Narsimha Badhini
    First published: