దివాలా వార్తలపై… లింగమనేని రమేశ్ క్లారిటీ

తన కంపెనీ దివాలా తీసినట్టు వచ్చిన కథనాల్లో నిజం లేదని లింగమనేని రమేశ్ స్పష్టత ఇచ్చారు.

news18-telugu
Updated: November 18, 2019, 7:55 PM IST
దివాలా వార్తలపై… లింగమనేని రమేశ్ క్లారిటీ
లింగమనేని రమేశ్(ఫైల్ ఫోటో)
  • Share this:
లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని ఆ సంస్థ అధినేత లింగమనేని రమేశ్ తెలిపారు. తన కంపెనీ దివాలా తీసినట్టు వచ్చిన కథనాల్లో నిజం లేదని ఆయన అన్నారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్‌ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని ఆయన తెలిపారు. వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ, జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్‌ వివరించారు. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్‌లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని లింగమనేని రమేశ్ స్పష్టం చేశారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను ఆయన తోసిపుచ్చారు. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు.


First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...