AP Weather Report: ఏపీలోని ఈ నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

Weather in Andhra Pradesh: ఏపీలోని పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  • Share this:
    AP Weather News: ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, పామూరు, కనిగిరి, గుడ్లూరు, పెదచెర్లోపల్లె, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కొండాపి, మద్దిపాడు, చీమకుర్తి, సంతనూతలపాడు, గిద్దలూరులతో పాటు నెల్లూరు జిల్లావరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, కలిగిరి, దగదర్తి, బోగోల్, జలదంకి, హనుమసముద్రంపేట, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, కావలిలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఇక కడప జిల్లా శ్రీఅవదూతకాశినయన, కలసపాడు, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని హెచ్చరించారు.

    ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. వీరంతా ముందస్తుగానే సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపారు. తమిళనాడు కోస్తా తీరం వెంబడి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి బలహీన పడింది. దీంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో మూడు రోజుల పాటు ఏపీలో వాతావరణ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
    Published by:Kishore Akkaladevi
    First published: