హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ఆనందయ్యకు ప్రాణ హాని ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Nellore: ఆనందయ్యకు ప్రాణ హాని ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

60వేల మందికి మందు ఇస్తే, ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని తప్పుబట్టడం సరికాదన్నారు నారాయణ. ఈ మందుపై కార్పొరేట్ మెడికల్ మాఫియా గగ్గోలు పెడుతోందని ఆయన విమర్శించారు.

60వేల మందికి మందు ఇస్తే, ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని తప్పుబట్టడం సరికాదన్నారు నారాయణ. ఈ మందుపై కార్పొరేట్ మెడికల్ మాఫియా గగ్గోలు పెడుతోందని ఆయన విమర్శించారు.

60వేల మందికి మందు ఇస్తే, ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని తప్పుబట్టడం సరికాదన్నారు నారాయణ. ఈ మందుపై కార్పొరేట్ మెడికల్ మాఫియా గగ్గోలు పెడుతోందని ఆయన విమర్శించారు.

  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆదివారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పర్యటించారు. ఆనందయ్య కరోనా మందు తయారుచేసే కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులతో పాటు ఆనందయ్య మందు తీసుకున్న వారితో నారాయణ మాట్లాడారు. అక్కడ వైద్యం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్‌కు ఆనందయ్య మందు అద్భుంగా పనిచేస్తుంని కొందరు స్థానికులు ఆయనతో చెప్పారు. ఎంతో మంది రోగులు విషమ పరిస్థితిలో వచ్చి.. ఈ మందు తీసుకున్న తర్వాత కోలుకున్నారని తెలిపారు. తామే కళ్లారా చూశామని చెప్పుకొచ్చారు. మందు పంపిణీని నిలిపివేయడంతో ఎంతో మంది నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా మందు ఇస్తే అందరికీ మేలు జరుగుతుందని నారాయణ దృష్టికి తీసుకొచ్చారు.

  అనంతరం మీడియాతో మాట్లాడిన నారాయణ.. మన పూర్వీకులు అందించిన ప్రకృతి వైద్యం ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ప్రకృతి వైద్యం నుంచే అల్లోపతి మందులు తయారయ్యాయని గుర్తు చేశారు. ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందు ఆయుర్వేదమని.. దానితో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నారాయణ చెప్పారు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, వైద్యులకు సాధ్యం కానిది.. ఒక రైతుకు సాధ్యమైందని కొనియాడారు. ఆనందయ్య మందుతో ప్రజల్లో కొండంత నమ్మకం కలిగిందని అన్నారు.

  60వేల మందికి మందు ఇస్తే, ఒకరికి సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని తప్పుబట్టడం సరికాదన్నారు నారాయణ. ఈ మందుపై కార్పొరేట్ మెడికల్ మాఫియా గగ్గోలు పెడుతోందని ఆయన విమర్శించారు. ఆనందయ్య మందును వారు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఆనందయ్యకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. త్వరితగతిన నివేదికలు పూర్తి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నారాయణ కరోరు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించి ఆనందయ్య మందును ప్రజలకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు

  ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణంపట్నానికి వెళ్లి ఆనందయ్య మందు తయారీ విధానాన్ని పరిశీలించారు. ఆయన ఏయే పదార్థాలు వాడుతున్నారు? ఎంత మోతాదులో వాడుతున్నారు. మందును ఎలా తయారు చేస్తున్నారో వీడియో తీశారు. ఓ రహస్య ప్రాంతంలో అధికారులకు ఆయన డెమో ఇచ్చారు. పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం అందులో ఎలాంటి హానికారక పదార్థాలు లేవని నిర్ధారించారు. అది కరోనాకు పనిచేస్తుందా? లేదా? అనే దానిపై వైద్యులు అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. మరోవైపు సోమవారం ఐసీఎంఆర్ బృందం కూడా కృష్ణపట్నంలో పర్యటించనుంది. ఆనందయ్య ఆయుర్వేద మందుపై వారు అధ్యయనం చేయనున్నారు. ఈ రెండు నివేదికలు వచ్చిన తర్వాతే మందు పంపిణీపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

  First published:

  Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, AP News, Nellore

  ఉత్తమ కథలు