Home /News /andhra-pradesh /

LIFE STYLE NEWS BEST HOME REMEDIES FOR FIGHT AGAINST OMICRON THESE ARE THE BENEFITS NGS

Omicron Remedies: ఒమిక్రాన్ తో నో టెన్షన్.. ఈ వంటింటి చిట్కాలు ఫాలో అవ్వండి..

ఒమిక్రాన్ కు వంటింటి చిట్కాలు

ఒమిక్రాన్ కు వంటింటి చిట్కాలు

Home remedies: ప్రస్తుతం అందర్నీ వణికిస్తున్న ఒమిక్రాన్ కు దూరంగా ఉండాలి అంటే.. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఈ వంటింటి చిట్కాలు ఫాలో అయితే చాలు అంటున్నారు వైద్య నిపుణులు.. ఆ వంటింటి చిట్కాలు ఏంటో తెలుసా..?

  Anna Raghu, Guntur, News18.

  Omicron Home Remedies:   ప్రస్తుతం యావత్ భారత దేశాన్ని ఒమిక్రాన్ (Omicron) భూతం భయపెడుతోంది. రోజూవారి కేసుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఇక తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ టెన్షన్ పడేలా చేస్తోంది. ఏపీలో అయితే నిత్యం.. 15 వేలకు దగ్గరగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇంతలా ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది. తమ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అయితే అందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు..  డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు.. మన వంటింటి చిట్కాలతోనే (Home made remedies)  ఒమిక్రాన్ దరిచేరనీయకుండా చూడొచ్చని ప్రభుత్వ ఆయుష్షు  వైద్యఅధికారి  డాక్టర్ ఆర్ శ్రీనివాస్ (Dr Srinivas) అభిప్రాయపడుతున్నారు. ఒమిక్రాన్ లాంటి వైరస్ లకు  భారతీయ వంటింటి చిట్కాలు  ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.

  అసలే శీతాకాలం కావడంతో అందరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. కరోనా లక్షణాలుగా చెప్పొకునే దగ్గు, జలుబు, గొంతులో గరగరలు రాకుండా జాగ్రత్తలు పాటించాలి.. కొందరికి ఇవీ ఎన్ని మందులు వాడినా తగ్గవు.. అయితే రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కచ్చితంగా వాటిని వెంటనే నివారించవచ్చని సలహా ఇస్తున్నారు.  వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంటి వైద్యం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందంటున్నారు.
  శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్‌లు రాకుండా శ్లేష్మం ఒక రక్షిత పాత్రను పోషిస్తుందని..  కానీ కొన్నిసార్లు అది మందంగా మారుతుండడంతో సమస్య వస్తోందంటున్నారు.

  ఇదీ చదవండి : ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్.. తాడో పేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక కీలక నిర్ణయం

  అయితే ఇది పాల ఉత్పత్తులను తినడం.. లేదా తాగిన తరువాత ఈ కఫ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. అల్లం,  తేనె వాడకంతో ఈ కఫ తీవ్రతన ఈజీగా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.  అల్లం మొండి శ్లేష్మాన్ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని, తేనెలో యాంటీ బాక్టీరియల్,  టీ ఫంగల్ గుణాలు ఉన్నాయని వెల్లడించారు.

  ఇదీ చదవండి : ఇక ఎదురుచూపులు లేవు.. ఉద్యోగ సంఘాల తీరుపై మంత్రుల ఫైర్

  గొంతు నొప్పి, కఫంతో బాధపడుతుంటే ఉప్పు నీటితో పుక్కిలించడం చాలామంచింది అంటున్నారు.  టేబుల్ స్పూన్ ఉప్పును ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు పుక్కిలించాలి. పుక్కిలించడం వల్ల  గొంటు చాలా మెరుగుపడుతందని సలహా ఇస్తున్నారు.

  ఇదీ చదవండి : 45 నిమిషాల్లోనే టీటీడీ ఫిబ్రవరి కోటా ఫుల్.. సర్వదర్శనం టికెట్లు విడుదల రేపే.. ఎలా బుక్ చేయాలంటే..?

  ప్రతి వంటింట్లో ఉండే.. పసుపు నిజమైన  ఔషదం అన్సూనారు.  దీనికి నొప్పిని, మంటను తగ్గించే శక్తి ఉంది అంటున్నారు.  ఒక గ్లాసు వేడి పాలలో పావు టీస్పూన్ నల్ల మిరియాలపొడి, అర టీ స్పూన్ పసుపు, ఒక టీస్పూన్ తేనె కలిపి.. శ్లేష్మం క్లియర్ అయ్యే వరకు  ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తాగమని సూచిస్తున్నారు.

  ఇదీ చదవండి : మంత్రి పదవికి కొడాలి రాజీనామా చేయాల్సిందే.. న్యాయ పోరాటం దిశగా టీడీపీ

  హెర్బల్ టీ కూడా కఫాన్ని దూరం చేస్తుందని..  పుదీనా, తులసి, సొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, బిరియానీ ఆకు అన్నీ వేసి నీళ్లు మరగబెట్టి సగం అయిన తరువాత దించి వడకట్టాలని..  తరువాత దీనికి  కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు.

  ఇదీ చదవండి : గో ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రం ప్రారంభం.. 15 రకాల వస్తువులు ఇవే.. ఎన్నో ప్రయోజనాలు.

  ఇక బాగా మరిగించిన నీటిలో యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరిని పీల్చడం ద్వారా ఉపశమనం పొందొచ్చని..  ఈ నూనె కొన్ని చుక్కలను కర్చీఫ్‌పై ఉంచి పీలిస్తే కూడా రిలీఫ్‌గా ఉంటుందన్నారు. ఇలాంటి  ఇంటి చిట్కాలను ఉపయోగించి థర్డ్ వేవ్ లో జనాలను ఎక్కువ ఇబ్బంది పెడుతున్న ఓమిక్రాన్ వంటి కరోనా వైరస్ లను ఇంటినుండి నివారించుకోవచ్చన్నారు.  అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో కూడా ఓమిక్రాన్ వైరస్ తో బడా పడేవారికి అమెరికన్ వైద్యులు ఈ భారతీయ ఇంటి చిట్కా వైద్యాలను వాడాలని చూచిస్తున్నారని గుర్తు చేశారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Health benefits, Life Style, Omicron

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు