Coronavirus: కరోనా ఎఫెక్ట్.. తిరుమలలో చిరుతలు హల్ చల్

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. జనసంచారం లేకపోవడంతో అటవీ ప్రాంతంలోని చిరుతలు తిరుమలలో సంచరిస్తూ కూలీల కంటపడ్డాయి.

news18-telugu
Updated: March 24, 2020, 5:26 PM IST
Coronavirus: కరోనా ఎఫెక్ట్.. తిరుమలలో చిరుతలు హల్ చల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరుమల కొండపైకి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో జనసంచారం లేకపోవడంతో అటవీ ప్రాంతంలోని జంతువులన్నీ తిరుమలలోకి ప్రవేశిస్తున్నాయి. మంగళవారం కల్యాణ వేదిక, ముల్లగుంట, ఎస్వీ మ్యూజియం, ఎస్వీ గెస్ట్ హౌజ్, మోకాళ్ల పర్వతం సమీపంలో చిరుత సంచరించినట్టు తెలుస్తోంది. అయితే ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు చేస్తున్న కూలీలకు చిరుత సంచరించడం కన్పించింది. దీంతో భయాందోళనకు గురైన కూలీలు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్డులో వాహనాలను టీటీడీ అనుమతించడం లేదు. ఇదిలావుంటే.. గతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్లే సమయంలో చిరుత కన్పించిన సందర్భాలు ఉన్నాయి. మెట్ల మార్గంలోనూ ఓ సందర్భంలో చిరుత భక్తులకు తారసపడిన ఘటనలు ఉన్నాయి.
First published: March 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading