హార్సిలీహిల్స్‌లో చిరుత కలకలం.. కుక్క అరవడంతో..

చిరుత పులి

లాక్‌డౌన్ కారణంగా జనసంచారం లేకపోవడంతో అడవి జంతువులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో చిరుత సంచారం కలకలం రేపింది.

  • Share this:
    కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో జనసంచారం లేకపోవడంతో అడవి జంతువులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్నాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. రైల్వే గెస్ట్ హౌస్‌లో పనిచేస్తున్న వాచ్‌మెన్.. కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో కుక్క అరుపులు విన్పించడంతో వాచ్‌మెన్ కుటుంబం బయటకు వచ్చారు. ఒక్కసారిగా చిరుతను చూడడంతో భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు. అనంతరం చిరుతపులి ఆ కుక్కను నోటితో కరుచికుని తీసుకెళ్లిపోయింది. హార్సిలీహిల్స్‌లో చిరుత దాడి చేయడం ఇది మూడో సారి. దీంతో హార్సిలీహిల్స్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చిరుత భారీ నుంచి కాపాడాలని పలువురు కోరుతున్నారు.
    Published by:Narsimha Badhini
    First published: