LEOPARD TENSION IN AHOBILAM AT KURNOOL DISTRICT IN ANDHRA PRADESH JUST WATCH TV VIDEO PHOTAGE NGS
Leopard Tension: అహోబిలం ఆలయం దగ్గర చిరుత భయం.. తృటిలో ప్రమాదం మిస్.. ఏం జరిగిందో చూడండి
అహోబిలంలో చిరుత కలకలం
Leopard Tension: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోంబిలంలో చిరుత కలకలం రేపుతోంది. అక్కడికి వెళ్లాలంటే భక్తులు భయపడేలా చేస్తోంది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు లైట్ తీసుకున్నారు. దీంతో ఓ భక్తుడిపై దాడి చేసింది చిరుత.. అయితే
తృటిలో ప్రమాదం తప్పింది.. అయితే అక్కడ చిరుత ఉంది అనడానికి సాక్ష్యం ఇదిగో అంటున్నారు భక్తులు.
Leopard Tension:కర్నూలు జిల్లా (kurnool District)లోని ప్రముఖ పుణ్య క్షేత్రం అహోబిలం (Ahobilam)లో చిరుత (leopard) సంచారం కలకలంగా మారింది. ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో.. ఎవరి పై దాడి చేస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. అటు వైపు వెళ్లాలి అంటే ఇటీవల జరిగిన దాడులే భక్తులకు గుర్తుకు వస్తున్నాయి. దీంతో కాస్త చీకటి పడిన తరువాత అటు వెళ్లాలి అంటే చిరుత దాడులే గుర్తువస్తున్నాయి. తాజాగా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో మరోసారి చిరుత దాడికి తెగబడింది. అహోబిలం ఆలయం దగ్గర భక్తుడి (Devotee)పై చిరుత దాడి చేసింది. ఎప్పటిలాగే ఓ భక్తుడు.. పావన నరసింహా స్వామి ఆలయ (Narasimha Swamy Temple)దర్శనం చేసుకుని.. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. కాలి నడక దారిలో ఎదో ఆలోచించుకుంటూ వెళ్తున్న భక్తుడు సడెన్ గా షాక్ తిన్నాడు.. క్షణాల్లోనే తేరుకోవడంతో పెను ప్రమాదం నుంచి క్షేమంగా భయటపడ్డాడు.. ఏం జరిగిందంటే.. అలా వెళ్తున్న భక్తుడిపై ఒక్కసారిగా చిరుతు దాడి చేసింది. వెంటనే అప్రమత్తమైన భక్తుడు.. మెట్లపై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. వెంటనే ఆయన తనకు జరిగి దాడికి సంబంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఇదే మొదటి సారి కాదు..ఇటీవల ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత సంచారం రైతులు భయపడేలా చేస్తోంది. ఓ రైతు… పంటకు నీరు అందించి బైక్‌పై వెళ్తుండగా చిరుత ఎదురుపడింది. దీంతో అతను తీవ్ర భయాందోళనకు గురై అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులతో కలిసి పులి కోసం పంట పొలాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు అలాంటిదేం లేదు అని మొదటిలో కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. కానీ గత వారం రోజులుగా చిరుత సంచారంతో అహోబిలం ఆలయ పరిసరాల ప్రాంతాల భక్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అహోం బిలంలోనే చిరుత ఉంటోంది అనడానికి ఇటీవల బయటపడ్డ సీసీటీవీ వీడియోనే నిదర్శనం..
గత శుక్రవారం ఎగువ అహోబిలంలో చిరుత సంచరించింది. ఆలయం వెనుక భాగంలో ఉన్న రామానుజాచార్యులు మండపం దగ్గర ఉన్న కుక్క పిల్లను చిరుత పట్టుకుని పోయింది. అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చిరుత ఆలయ పరిసరాల్లో సంచరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించినవే ఆ సీసీటీవీ దృశ్యాలు.. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటికైన అధికారులు అప్రమత్తమై.. చిరుత భయం పోయేలా చేయాలని వేడుకుంటున్నారు.. లేదంటే అహోబిలం వెళ్లాలి అంటే ఆలోచించాల్సి వస్తుందని.. ఇతర ప్రాంతల నుంచి కూడా భక్తుల రాకపోకలు తగ్గిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు.. తాజాగా సీసీ టీవీ ఫుటేజ్ అధారంగా చిరుత కోసం అటవీ అధి,కారులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.