Home /News /andhra-pradesh /

LEOPARD SEEN IN TIRUMALA HILLS CAUGHT TO CCTV CAMERA AK

Leopard in Tirumala: తిరుమల వీధుల్లో సంచరించిన చిరుత

చిరుత(ఫైల్ ఫోటో)

చిరుత(ఫైల్ ఫోటో)

Tirumala: తిరుమలలోని పశ్చిమ మాఢవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద చిరుత కాసేపు సంచరించింది.

    కొన్ని నెలలుగా తిరుమలకు భక్తుల తాకిడి తక్కువగా ఉంటోంది. ఇప్పటికీ తిరుమలలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తోంది టీటీడీ. దీంతో ఇప్పటికీ తిరుమల కొండపై రద్దీ స్వల్పంగా ఉంది. భక్తుల సంచారం తక్కువగా ఉండటంతో.. అడవి జంతువులు తరుచుగా తిరుమలలో ప్రవేశిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రాత్రి సమయాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు బయటకు వస్తున్నాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు సైతం చిక్కాయి. తాజాగా నిన్న రాత్రి తిరుమలలో చిరుత సంచరించడం కలకలం రేపుతోంది.



    సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది చిరుత అని అధికారులు నిర్ధారించారు. తిరుమలలోని పశ్చిమ మాఢవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద చిరుత కాసేపు సంచరించింది. తర్వాత మ్యూజియం గోడపై ఉన్న చిరుత.. కాసేపటి తర్వాత తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అయితే చిరుత సంచరించిన ప్రాంతాన్ని అధికారులు సందర్శించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు