Home /News /andhra-pradesh /

LEGENDARY HEROIN SRIDEVI DAUGHTER JANHVI KAPOOR IN TIRUMALA IN COMPLETER TRADITIONAL DRESS NGS

Janhvi Kapoor: శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు.. జాన్వీ ఇలా ఎప్పుడైనా చూశారా? తల్లిని గుర్తు చేస్తోన్న తనయ

శ్రీదేవి కూతురుని ఇలా ఎప్పుడైనా చూశారా?

శ్రీదేవి కూతురుని ఇలా ఎప్పుడైనా చూశారా?

Janhvi Kapoor In Tirumala:బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్. తన అందాలతో యువతను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాంటి బ్యూటీ బేబి.. పోలికే లేకుండా మారిపోయింది. అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోంది..

ఇంకా చదవండి ...
    Sridevi Daughter Janhvi Kapoor In Tirumala: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్. తన అందాలతో యువతను నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ అయ్యింది. ఇతర భాషాల్లోనూ ఆమెతో సినిమా చేయించాలని చాలామంది దర్శకులు క్యూడుతున్నారు. అంతటి అందం.. అభినయం సొంతం చేసుకుంది. తల్లికి తగ్గ కూతురిగా ముద్ర వేసుకుంటోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ..యూత్ కు నిద్ర పట్టకుండా చేస్తోంది. కోట్లాది మందికి డ్ర్రీం గాల్ గా మారింది.. ఆమె ఇనిస్టాలో పెట్టిన ఫోటోల కోసం ఫ్యాన్స్ ఎగబడి చూస్తూ ఉంటారు. అంత క్రేజ్ సొంతం చేసుకుంది. అలా ఎప్పుడు అందాల ఆరబోతలో ముందు ఉంటున్న జాన్వీ కపూర్ ఒక్కసారి ట్రెండ్ మార్చారు.. కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమలలో ఆమెను చూసి అంతా షాక్ అయ్యారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాహ్నవి కపూర్ కు అర్చకులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

    ఎప్పుడు హాట్ హాట్ గా ఉండే.. జాహ్నవి హిందు సంప్రదాయాలను గౌరవిస్తూ.. అచ్చ తెలుగమ్మాయిలా లంగావోణీ వేసుకుని వచ్చింది. జాన్వీ తన స్నేహితురాలితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకోవడం అందరిని ఆకర్షించింది. ఆమెను చూసినవారంతా అచ్చం తల్లిలానే ఉంది అని సంతోషిస్తున్నారు. జాన్వీని అలా చూసేందుకు జనం ఎగబడ్డారు. తల్లి శ్రీదేవి బాటలో పయనిస్తూ.. ఇప్పటికే జాన్వీ బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి నటి అనిపించుకుంది. కరోనా నేపథ్యంలో జాహ్నవి నటిస్తున్న సినిమాల షూటింగ్ కు అంతరాయం ఏర్పాడింది. అయితే తెలుగు ప్రేక్షకులు జాహ్నవి కపూర్ తెలుగు సినిమాల్లో నటించాలని.. తల్లి శ్రీదేవిలా అలరించాలని కోరుకుంటున్నారు.

    శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలివుడ్లో ధడక్ లాంటి మంచి విజయంతో ఆరంగేట్రం చేసింది. తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్ తో జాహ్నవి అభిమానులకు కనులవిందు చేస్తోంది. అచ్చం శ్రీదేవిని తలపిస్తోంది అని అంతా ముచ్చట పడుతున్నారు. కేవలం లుక్స్ లోనే కాదు.. అభినయంలోనూ అదే స్థాయి గుర్తింపు తెచ్చుకుంది..

    ఇదీ చదవండి: నటుడిగా మారిన అధికార పార్టీ నేత.. సినిమాలో కీరోల్ పోషిస్తున్నఎమ్మెల్యేను గుర్తు పట్టారా?

    చేసినవి తక్కువ సినిమాలే అయినా లెంజడరీ డాటర్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఆమెతో టాలీవుడ్ ఎంట్రీ ఇప్పించాలని చాలామంది దర్శకులు.. యువ హీరోలు ఆరాట పడుతున్నా.. ఇప్పటి వరకు అది వర్కౌట్ కాలేదు..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Heroine janhvi kapoor, Janhvi Kapoor, Tirumala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు