హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CRDA Controversy: అమరావతిపై మరో వివాదం.. సీఆర్డీఏకి లీగల్ నోటీసులు.. కారణం ఇదే..!

CRDA Controversy: అమరావతిపై మరో వివాదం.. సీఆర్డీఏకి లీగల్ నోటీసులు.. కారణం ఇదే..!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh రాజధాని అమరావతి (Capital Amaravathi) ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ (CRDA) మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా ప్రభుత్వానికి లీగల్ నోటీసులు వెళ్లాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh రాజధాని అమరావతి (Capital Amaravathi) ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ (CRDA) మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా ప్రభుత్వానికి లీగల్ నోటీసులు వెళ్లాయి.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh రాజధాని అమరావతి (Capital Amaravathi) ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ (CRDA) మరోసారి వివాదాస్పదమైంది. తాజాగా ప్రభుత్వానికి లీగల్ నోటీసులు వెళ్లాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh రాజధాని అమరావతి (Capital Amaravathi) ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ (CRDA) మరోసారి వివాదాస్పదమైంది. ఇప్పటికే రాజధాని నిర్మాణం, అమరావతి ప్రాంతంలో భూముల తనఖా వంటే అంశాలతో పలు వివాదాలు చుట్టుముట్టగా.. తాజాగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణ వ్యవహారం కాంట్రవర్సీగా మారింది. అమరావతి పరిధిలో టీడీపీ ప్రభుత్వం చెప్పిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు విషయంలో సీఆర్డీఏకు నోటీసులందాయి. 2018 లో అప్పటి ప్రభుత్వం సీఆర్డీఏ ద్వారా హ్యాపీనెస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుబాటు ధరల్లో 12 టవర్స్, 1200 ప్లాట్స్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆన్ లైన్లో బుకింగ్ ప్రారంభించింది. గంటలో మొత్తం ప్లాట్స్ అమ్ముడుపోవడంతో ప్రాజెక్టుకు భారీగా డిమాండ్ పెరిగింది.

  సీఆర్డీఏతో ఒప్పందం మేరకు కొనుగోలుదారులు తొలి వాయిదాగా 10 శాతం చెల్లించారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి షాపూర్జీ పల్లోంజీ సంస్థ ముందుకు వచ్చింది. కొనుగోలుదారులు, సీఆర్డీఏకి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం డిసెంబర్ 31, 2021 నాటికి ప్లాట్లను పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. కానీ.. ఈ మధ్యలో ప్రభుత్వం మారడం, అమరావతి విషయంలో సందిగ్ధత నెలకొనడంతో హ్యాపీనెస్ట్ ముందుకి కదల్లేదు. పనులు ముందుకు సాగకపోవడంతో న్యాయపోరాటానికి వెళతామని 2020లోనే కొనుగోలుదారుల హెచ్చరించారు. దీనిపై స్పందించిన ప్రస్తుత ప్రభుత్వం హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది రీటెండర్ పేరుతో కదలిక వచ్చినా జరిగినా.. ప్రాజెక్టును నిర్మించేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది.

  ఇది చదవండి: మళ్లీ తెరపైకి జిన్నా టవర్ వివాదం.. జాతీయ జెండా తొలగింపు..! అధికారుల క్లారిటీ..


  దీంతో సీఆర్డీఏ చేసిన అగ్రిమెంట్ ప్రకారం గడువు తీరిపోవడంతో కొనుగోలు దారులు తమ అడ్వాన్స్ తిరిగిచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా చెల్లించిన 10% సొమ్ముతో పాటు దానిపై 14% వడ్డీ చెల్లించాలంటూ సీఆర్డీఏకు నోటీసులు ఇచ్చారు. నష్టపరిహారం కింద రూ.20 లక్షలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు అవసరమైతే సీఆర్డీఏపై ‘రేరా’ చట్టం కింద కేసు వేస్తామంటూ కొనుగోలుదారులు హెచ్చరించారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు ద్వారా సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపించారు.

  ఇది చదవండి: 2024లో జగన్ ను ఢీ కొట్టేది ఆయనే.. క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు..


  గత ప్రభుత్వం ‘హ్యాపీ నెస్ట్‌’పేరుతో సీఆర్డీఏ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి పరిధిలో ఉన్న నేలపాడు సమీపంలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లను నిర్మించి అందులో 1200 అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. 15 ఎకరాలలో ఈ ప్లాట్ల నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమైంది. చదరపు అడుగు 3వేల492 రూపాయల వ్యయంతో ఒక్కో టవర్ 19 అంతస్తులతో నిర్మాణం కానుందని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఐతే సీఆర్డీఏ చేసిన ఒప్పందం ప్రకారం ఫ్లాట్లు అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు లీగల్ నోటీసులు పంపించారు.

  First published:

  Tags: Amaravathi, Andhra Pradesh, Crda

  ఉత్తమ కథలు