సప్తగిరి మాస పత్రిక వివాదంలో ఇద్దరు టీటీడీ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. రామాయణాన్ని వక్రీకరిస్తూ కుశుడు పేరుతో ఏప్రిల్‌లో సంచితలో ఓ కథనం వచ్చింది. ఆ కథనం ప్రచురించిన ఎడిటర్ (టీటీడీ పబ్లికేషన్ చీఫ్, సబ్ ఎడిటర్ (అసిస్టెంట్) సస్పెండ్ అయ్యారు. అన్నదమ్ములైన లవ, కుశ (కవలలు)ల్లో... కుశుడు... సీతాదేవికి పుట్టలేదని సంచితలో కథనం వచ్చింది. వాల్మీకి మహర్షి...... తన మంత్ర శక్తితో... పవిత్ర గడ్డిని కుశుడిగా మలిచారని ఆ కథనంలో ఉంది. ఆ మేగజైన్ ఏప్రిల్ ఎడిషన్‌లో ఓ 9వ తరగతి విద్యార్థి ఆ విధంగా కథనం రాశాడు. అది ఎంత దుమారం రేపాలో అంతా రేపింది. హైందవ మతస్థులు భగ్గుమన్నారు. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు జరిగాయి.
టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంక్వైరీకి ఆదేశించారు. అసలా ఆర్టికల్ ఎలా పబ్లిష్ అయ్యిందో తేల్చమన్నారు. అప్పుడో కొత్త విషయం తెలిసింది. ఇదే ఆర్టికల్ 2016-17లో వస్తే... అప్పట్లో ఎడిటోరియల్ టీమ్ దాన్ని తిరస్కరించిందని టీటీడీ వర్గాల ద్వారా తెలిసింది. మరి అదే ఆర్టికల్ ఇప్పుడు ఎలా పబ్లిష్ అయ్యిందో అయ్యింది.
ఆ 9వ తరగతి విద్యార్థి... పిల్లల కోసం ఆ కథనం రాశాడని తెలిసింది. అందులో... ఆశ్రమంలో వాల్మీకి దగ్గర లవను ఉంచి... సీతాదేవి స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో వాల్మీకి పూజలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఓ కోతి వచ్చి లవను తీసుకెళ్లిపోయింది. ఆందోళన, ఆవేదన చెందిన వాల్మీకి... వెంటనే పవిత్ర గడ్డిని తీసుకొని... దాన్ని తన మంత్ర శక్తితో... కుశుడిగా మలిచాడు. తద్వారా... సీతాదావి... ఆ కుశుడినే లవుడిగా భావిస్తూ... ఆందోళన చెందకుండా ఉంటుందని భావించారని రాశాడు. ఐతే... లవుడిని తీసుకెళ్లిన కోతి... నది దగ్గర వదిలేసింది. సీతాదేవి రిటర్న్ వస్తుంటే... అక్కడ లవను చూసి... తనతో వెంట తీసుకొని ఆశ్రమానికి వచ్చిందనీ... తీరా అక్కడికి వచ్చి కుశుడిని చూసి... ఇదేంటని అడిగితే... వాల్మీకి జరిగింది చెప్పారనీ... అప్పుడు సీతాదేవి... కుశుడిని కూడా తన కొడుకుగా భావించి... దగ్గరకు తీసుకుందని ఆ విద్యార్థి కథనం. కొన్ని వారాలుగా ఈ కథనంపై దుమారం రేగుతూనే ఉంది. అసలే కరోనా సమస్యలతో ఉన్న టీటీడీకి ఈ కథనం మరో తలనొప్పిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tirumala news