తిరుమలలో లాఠీచార్జి జరిగిందా? TTD ఛైర్మన్ ఏమన్నారంటే?

ప్రతీకాత్మక చిత్రం

తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  తిరుమల లో శ్రీనివాసుడి దర్శనం కోసం వస్తున్న భక్తులపై పోలీసులు లాఠీచార్జి చేశారన్న ఆరోపణలను టీటీడీ చైర్మెన్ వై వి సుబ్బారెడ్డి కొట్టిపారేశారు. ఇవన్నీ ప్రతిపక్షాలు చేస్తున్న అబద్దాలని ఆయన అన్నారు. తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్న భక్తులపై ఎక్కడా లాఠీచార్జి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. భక్తులపై లాఠీచార్జి జరిగినట్లు ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు చైర్మన్ పై సమాధానం ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాట్లలో టీటీడీ యంత్రాంగం సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడటం తనకు ఇష్టం లేదని విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేసే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు.

  దర్శనం టికెట్లు లేని భక్తులు అలిపిరి వద్దకు భారీ ఎత్తున చేరగా.. వారిపై లాఠీచార్జి జరిగిందని  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు  చేసిన నేపథ్యంలో టీటీడీ పై విధంగా  స్పందించింది.
  Published by:Srinivas Munigala
  First published: