GT Hemanth Kumar, Tirupathi, News18
Trending Song: జారు మిఠాయా.. నా జారు మిఠాయా..? నువ్వొస్తావని ఓ రబ్బాయో నేను సిల్కి చీర కట్టుకుంటునీ.. ఈ పాట ఎక్కడ చూసిన ఓ ఊపు ఊపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో యువత అంతా ఈ పాఠకు పిధా అయిపోతున్నారు. ఇటీవల రిలీజ్ అయిన మంచు విష్ణు సినిమా (Manchu Vishnu Movie) జిన్నా (Ginna) లోని పాట ఇది. అయితే ఒరిజినల్ పాట కంటే..? ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సింగర్ భారతమ్మ (Singer Barathamma) పాడిన జారు మిఠాయా.. జారు మిఠాయా పాటు తెలుగు ఉర్రూతలుగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పాట చుట్టూ విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇంతకీ ఈ సాంగ్ ఎందుకంత స్పెషల్.. ఈ పాట ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా.. పాటిన భారత బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే అంతా షాక్ అవుతారు..
తిరుపతి జిల్లా (Tirupati District) మారుమూలపల్లె.. ప్రాంతం అది.. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి (Sri Prasanna Venkateswara Swamy Temple) ఆలయానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో సమీప బంధువులు.. వరుసకు అక్కచెల్లెలు.. బావ బావమరుదులు ఉండే పల్లె. చుట్టూ పక్కల ఉండే వారికీ తప్ప.. బయటివారికి తెలియని గ్రామం అది. ఆ గ్రామమే ఇప్పుడు సోషియల్ మీడియాను షేక్ చేస్తోంది.
అదే బాలి నాయుడు కండ్రిగ.. ఒకే ఒక్క పాటతో వారి ఊరివైపు ప్రజలను చూసేలా చేసారు...నాగరాజమ్మ వారి బంధువులు. కొన్ని వందల కొద్దీ జానపద గేయాలు అలవోకగా పడే పల్లెవాసులు బాలి నాయుడు కండ్రిగ వాసులు. నాగులమ్మ ఆలయ కుంభాబిషేకంలో పాల్గొని.. జానపద పాటలు పాడారు. మోహన్ బాబుకు ఆప్తులైన ఈశ్వర్ రెడ్డి.. వీరి గేయాలను కలెక్షన్ కింగ్ చెవిలో పడేలాచేసారు. నాగరాజమ్మ బృందం పాడిన కొన్ని పాటల్లో రెండు పాటలను జతచేసి ఒక్కపాటగా.. జిన్నా సినిమాలో విడుదల చేసారు.
ఇదీ చదవండి : గంటాకు కలిసివస్తున్న అంశం అదే..? ఆ లెక్కలతోనే డిమాండ్లు పెడుతున్నారా?
అయితే సినిమాలో పాటకు వచ్చిన పాపులారిటీ కన్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన పాటకే అధిక శాతం పాపులారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ఒక్క అక్షరం ముక్క రాని నాగరాజమ్మ.. వారి బృందం ఎన్నో పాటలను అలవోకగా పడేస్తున్నారు. పొలం పనులు చేస్తున్న సమయంలో పాడే పాటల నుంచి.. పెళ్లి.. నిశ్చథార్ధం.. నలుగు.. ఓని ఫంక్షన్.. పురుడు వంటి కార్యక్రమాల్లో పడే పాట వరకు పడేస్తున్నారు. ఎవరి పాటలో కాపీ కొట్టకుండా వాళ్ళ పూర్వికులు నేర్పిన పాటలు నేటి తరానికి అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి : దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర.. లిక్కర్ స్కామ్‌పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమ పాటలు.. భర్తకోసం ఎదురుచూసే పాటలు ఇలా తమ స్వరాన్ని జానపద బండాగారంగా మలుచుకున్నారు. జంబలకిది జారు మిఠాయ.. ఓ రబ్బాయ.. ఓ రబ్బయ్య పాటను మొదటి సారి విన్న వారికీ కొత్తగా.. వింతగా అనిపించినా... మళ్లీ మళ్లీ.. ఆ పాటలు వినడం ద్వారా హమ్మింగ్ చేస్తున్నారు కొందరు. ప్రస్తుతం సోషియల్ మీడియాలో ఈ పాట ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో... అంతే వేగంగా ట్రోల్ కూడా అవుతోంది. జానపద గాయనిల అంతార్ధం తెలుసుకోకుండా ఇలా ట్రోల్ల్స్ చేయడం మంచిది కాదని కొందరు తమ భావనను వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chittoor, VIRAL NEWS