Shock to CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలను ఒక కుదుపుకు గురి చేశాయి అని చెప్పాలి తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (MLC Election Result) .. ఎందుకంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత.. ఆ పార్టీకి విజయం దాదాపు దూరమైంది..? ఎన్నిక ఏదైనా..? వైసీపీ (YCP)దే విజయం అవుతూ వచ్చింది.. వార్ వన్ సైడ్ అని అంతా డిసైడ్ అయ్యారు. ఏపీలో ప్రతిపక్షాలు లేవని పచారం మొదలైంది. అసలు డిపాజిట్లు కూడా రావంటూ వైసీపీ నేతలు తొడలు కొట్టారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అయితే.. 175కి 175 స్థానాలు ఎందుకు గెలవలేం అంటూ పదే పదే చెబుతున్నారు. ప్రతి మీటింగ్ లోనూ ఆయన చెప్పేది అదే.. 175కి 175 మనవే అంటూ కేడర్ లో ధైర్యం నింపుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కంచుకోట.. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ జెండా ఎగరబోతోంది అని సవాల్ విసిరారు కూడా.. కానీ ఇప్పుడు జగన్ లెక్క తప్పిందా..? ఏపీ ప్రజలు అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని సిద్ధమయ్యారా..?
సీఎం జగన్ మాటలు విన్న.. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇంతకాలం కాలర్ ఎగురవేసుకుంటూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని.. వచ్చే ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటివి.. గెలిచి చూపించండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు.. కానీ ఇప్పుడు ఫలితాలు చూసిన తారువాత వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైందంటున్నారు.
ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు మూడు చోట్ల జరుగగా.. రెండు చోట్ల టీడీపీ భారీ విజయం దక్కించుకుంది.. మరో చోటు పోటీ హోరా హోరీగా ఉంది. గెలుపు రెండు పార్టీల మధ్య దోబూచులాడుతోంది. అసలు పోటీలోనే ఉండదు అనుకున్న టీడీపీ రెండు చోట్ల నెగ్గడం.. మరో చోట గట్టి పోటీ ఇవ్వడంతో అధికార వైసీపీకి.. అధినేత సీఎం జగన్ కు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
ఇదీ చదవండి : మెగా బ్రదర్స్ మధ్య కషాయ చిచ్చు.. ఏపీలో బీజేపీ వ్యూహం వర్కౌట్ అయ్యేనా..?
గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలే ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 ఎలా సాధ్యమవుతుందని అన్ని వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గ్రాడ్యుయేట్స్ మనసు గెలుచుకోలేని వైసీపీ.. 175 ఎలా నెగ్గుతుందని సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ చాలా హంగామా చేసింది. భారీగా ప్రలోభాలకు గురి చేసినట్టు ప్రచారం ఉంది. అంతేకాదు దొంగ ఓట్లు కూడా భారీగా వేయించారు అని ఫిర్యాదులు అందాయి. చాలాచోట్ల పోలీసులు, అధికారులు వైసీపీకి మద్దతుగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి.. పోల్ మేనేజ్మెంట్ లో నెంబర్ వన్ అయిన సీఎం జగన్.. ఇన్ని అంశాలు అనుకూలంగా ఉన్నా.. ఫలితాలు మాత్రం విరుద్ధంగా వచ్చాయి. మరి ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తే వైసీపీ పరిస్థితి ఏంటి అని రాజకీయ విశ్లేషకలు ప్రశ్నిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Ycp