గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ (Health Bulletin) రిలీజ్ చేశారు. ప్రస్తుతం తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రత్యేక వైద్యబృందం ఆధ్వర్యంలో ఇంకా చికిత్స కొనసాగుతుందని తెలిపారు. బెలూన్ యాంజియోప్లాస్టి ద్వారా రక్తాన్ని పంపింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం తారకరత్నకు ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాం అని వైద్యులు బులెటిన్ లో పేర్కొన్నారు. కాగా నిన్న ఏపీలోని కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న (Nandamuri Tarakaratna) గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.
అయితే మొదట తారకరత్న (Nandamuri Tarakaratna) అస్వస్థతకు గురయ్యారని అంతా భావించారు. దీనితో ఆయనను కేఈసీ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అయితే ఆయనను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో పల్స్ లేదని, శరీరం కూడా బ్లూగా మారిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి తరలించిన 45 నిమిషాల అనంతరం ఆయన పల్స్ తిరిగి ప్రారంభం అయిందని డాక్టర్లు వెల్లడించారు. ఇక ఆక్కడి నుంచి కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి సీపీఆర్, యాంజియోగ్రామ్ కూడా చేశారు. అయితే ఆయన గుండెకు రెండు వైపులా బ్లాక్స్ వున్నాయని అందువల్ల రక్తం సరఫరా కావడం లేదన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనితో అత్యవసర చికిత్స కోసం తారకరత్నను గ్రీన్ ఛానల్ ద్వారా రాత్రి ఒంటిగంటకు నారాయణ హృదయాలయానికి తరలించారు. 2 గంటల నుంచి ఆరుగురు ప్రత్యేక డాక్టర్ల వైద్య బృందం చికిత్స ప్రారంభించారు. ఇప్పటివరకు యాంజియోప్లాస్టి చేసి గుండె నాళాలకు రక్తాన్ని పంప్ చేసేలా చేస్తున్నారు. ఇక ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వైద్యులు బులెటిన్ లో పేర్కొన్నారు. ఇంకా కొన్ని రోజులు చికిత్స అందించాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నామని వైద్యులు తెలిపారు.
బెంగళూరులోనే బాలకృష్ణ..
సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇంకా బెంగళూరులోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి దగ్గరుండి బాలయ్య చూసుకుంటున్నారు. ఇక నేడు సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు , పలువురు కుటుంబసభ్యులు కూడా బెంగళూరుకు రానున్నట్టు తెలుస్తుంది. నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP News, Balakrishna, Nandamuri, Nara Lokesh, TDP