హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: వందేళ్ల రికార్డులు తరగరాస్తున్న జగన్.. వెయ్యి గ్రామాల్లో పనులు పూర్తి..

Andhra Pradesh: వందేళ్ల రికార్డులు తరగరాస్తున్న జగన్.. వెయ్యి గ్రామాల్లో పనులు పూర్తి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) చేపట్టిన భూముల రీసర్వే ( Land Resurvey)కార్యక్రమం త్వరితగతిన సాగుతోంది. ఇప్పటికే వెయ్యికిపైగా గ్రామాల్లో సర్వే పూర్తైంది

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వందేళ్ల భూముల రికార్డులు తిరగరాసే విధంగా ప్రభుత్వం సమగ్ర భూరీసర్వే చేస్తోంది. భూ వివదాలకు చెక్ పెట్టేలా.. భూముల సరిహద్దులు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుటోంది. ఇందులో భాగంగా అధునాతన టెక్నాలజీ, డ్రోన్లు, ఇతర పరికారలను వినియోగిస్తోంది. దాదాపు ఏడాదిగా సాగుతున్న భూముల రీసర్వే(Land Rurvey) కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఇప్పటికే వెయ్యికిపైగా గ్రామాల్లో సర్వే పూర్తైంది. మిగిలిన గ్రామాల్లోనూ వేగంగా సర్వేను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే విజయవంతం కావడంతో మరో 1,034 గ్రామాలను రీసర్వే కోసం ఎంపిక చేశారు. వీటిలో మొదటి విడత 650 గ్రామాలు, రెండో విడత 384 గ్రామాల్లో సర్వే ప్రారంభించారు. 513 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది.

కాగా.., సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్‌-13 నోటిఫికేషన్లు కూడా ఈ గ్రామాల్లో జారీ చేశారు. మిగిలిన 598 గ్రామాల్లో ఈ నెలాఖరుకు నోటిఫికేషన్లు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 108 గ్రామాల్లో రీసర్వే పూర్తికాగా.. త్వరలో మరో 118 గ్రామాల్లో నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. అల్లూరి సీతారామరాజు, గుంటూరు, విశాఖ, కోనసీమ జిల్లాల్లో తక్కువ గ్రామాల్లో సర్వే పూర్తైంది. మలి దశలో ఈ జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వేకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటివరకు 1,854 గ్రామాల్లో డ్రోన్‌ సర్వే పూర్తైంది. అందులో 1,142 గ్రామాల డ్రోన్‌ చిత్రాలు రెవెన్యూ బృందాలకు చేరాయి.

ఇది చదవండి: రైతులకు డ్రోన్లు.. ట్రాక్టర్లు.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్


మిగిలినవి కూడా అందగానే ఆ గ్రామాల్లో సర్వేను ముమ్మరం చేస్తామని సర్వే సెటిల్మెంట్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ తెలిపారు. రీసర్వే అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోందని వెల్లడించారు. 3 నెలల్లోనే 1034 గ్రామాల్లో సర్వేను తుది దశకు తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామాల్లో భూయజమానుల నుంచి వస్తున్న అభ్యంతరాలను సాధ్యమైనంత వరకు సర్వే బృందాలే పరిష్కరిస్తుండగా... చాలా తక్కువ సంఖ్యలో అభ్యంతరాలు తహశీల్దార్‌ వరకు వెళుతున్నాయన్నారు. 9,278 అభ్యంతరాలు రాగా 8,933 అభ్యంతరాలను సర్వే బృందాలు పరిష్కరించినట్లు తెలుస్తోంది.

ఇది చదవండి: ఏపీలో రియల్ ఢమాల్.. సర్కార్ నిర్ణయంతో చిక్కులు.., మొదటికే మోసం వస్తుందా..?


ఈ పథకం కోసం రాష్ట్రప్రభుత్వం 70 కార్స్ బేస్‌ స్టేషన్లను స్థాపించింది. మరోవైపు 1000 రోవర్లను కొనుగోలు చేసింది. మరో 1000 రోవర్లు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ పరిజ్ఞానముతో భూ సరిహద్దులను అక్షాంశ – రేఖాంశాలతో ఖచ్చితత్వoతో కొలిచి భూయజమానులకు అప్పగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా సర్వే పనులకు అత్యంత కీలకమైన ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజిల ఉత్పతి పెంచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ ఏజెన్సీల సేవలను ఆహ్వానించగా మంచి స్పందన కనిపించింది. టెండర్ విధానంలో జిల్లాల వారీగా వర్క్ ఆర్డర్ ఇచ్చేలా టెండర్ ప్రక్రియను రూపొందించగా 11 ఏజెన్సీలు పాల్గొన్నాయు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయవలసిన విస్తీర్ణం సుమారు 1.33 లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా సర్వే ఆఫ్ ఇండియాకు 40,690 చదరపు కిలోమీటర్లు, ఇతర ప్రవేటు డ్రోన్ ఏజెన్సీ లకు సుమారు 92,310 చదరపు కిలోమీటర్లు కేటాయించారు.

First published:

Tags: Andhra Pradesh, Lands

ఉత్తమ కథలు