దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...

AP Assembly Election 2019 : ఇన్నాళ్లూ... లోటస్ పాండ్ కేంద్రంగా వైసీపీ రాజకీయాలు నడిచాయి. రేపు అధికారంలోకి వస్తే, ఏపీలోనే శాశ్వతంగా ఉండేందుకు దొనకొండను ఎంచుకుంటున్నారు వైసీపీ నేతలు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 10, 2019, 9:34 AM IST
దొనకొండపై వైసీపీ నేతల దృష్టి... జోరుగా భూముల కొనుగోళ్లు...
దొనకొండ మ్యాప్ (Image : Google Maps)
  • Share this:
ప్రకాశం జిల్లాలో కోడి గుడ్డు ఆకారంలో ఉంటుంది దొనకొండ. మధ్యలో రైల్వే ట్రాక్. ఊరి మధ్యలో రైల్వే ట్రాక్. చుట్టూ ఖాళీ భూములు... అక్కడక్కడా ఇళ్లతో ఆకట్టుకుంటుంది దొనకొండ. అద్దంకి రోడ్డులో వెళ్తే దొనకొండ నుంచీ ఒంగోలు వంద కిలోమీటర్ల లోపే ఉంది. ఇంకాస్త ముందుకి వెళ్తే... సేద తీర్చేందుకు సముద్రమూ ఉంది. మరి ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు దొనకొండ నచ్చకుండా ఎలా ఉంటుంది. అందుకే వైసీపీ నేతల దృష్టి దొనకొండపై పడింది. అక్కడ భూములు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ అనుచరులను పంపి... దొనకొండలో రియల్టర్లతో బేరసారాలు నడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు... విజయవాడ నుంచి కూడా చాలా మంది వైసీపీ నేతలు... దొనకొండలో ఎన్ని ఎకరాలు కొనుక్కోవాలనే అంశంపై ఎవరికి వాళ్లు లెక్కలేసుకుంటున్నారు. దాంతో ఆటోమేటిక్‌గా దొనకొండలో భూముల రేట్లు పెరిగాయి. వైసీపీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనలో ఉన్న నేతలంతా... దొనకొండలో భూములు కొనేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.

దొనకొండ ఎందుకు : రాయల సీమ ప్రజలకు అమరావతి కంటే దొనకొండ చాలా దగ్గర. పైగా... వైసీపీ అధికారంలోకి వస్తే... దొనకొండకు దగ్గర్లోనే రాజధానిని నిర్మిస్తారనే ప్రచారం ఒకటి జరుగుతోంది. దానికి తోడు చాలా మంది వైసీపీ నేతలు అక్కడ 2014లోనే భూములు కొనుక్కున్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే, రాజధానిని మార్చేస్తారని టీడీపీ ప్రచారం చెయ్యగా... అలాంటిదేమీ ఉండదని, అమరావతే రాజధానిగా ఉంటుందని కృష్ణా జిల్లా ప్రజలకు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారు. ఆయన సీఎం అయితే... ఇచ్చిన మాట ప్రకారమే అమరావతిని రాజధానిగా ఉంచుతారా లేక... మార్చేస్తారా అన్న అంశం తేలాల్సి ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఎందుకైనా మంచిదని ముందుగానే దొనకొండలో భూములు కొనిపెట్టుకుంటున్నారు. ఒకవేళ దొనకొండ దగ్గర్లో రాజధానిని ప్రకటిస్తే, ఇప్పుడు కొనుక్కునే భూముల రేట్లు నాలుగైదు రెట్లు పెరిగే అవకాశాలుంటాయి.

చిత్రమేంటంటే... దొనకొండతో పోల్చితే ఒంగోలు ఇంకా మేలు. అది సముద్రానికి దగ్గరగా ఉండటమే కాక... ప్రకాశం జిల్లా కేంద్రం కూడా. అక్కడ కూడా చుట్టుపక్కల భూములున్నాయి. అయినప్పటికీ... వైసీపీ నేతలు మాత్రం దొనకొండే రాజధాని అవుతుందన్న నమ్మకంతో అక్కడే భూములు కొంటున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం దొనకొండలో ఎకరం రూ.12 నుంచీ రూ.20 లక్షల దాకా పలుకుతోంది. వైసీపీ అధికారంలోకి వస్తే... ఎకరం రూ.30 లక్షలు పలికినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు రియల్టర్లు.

 

ఇవి కూడా చదవండి :ఐపీఎల్ బెట్టింగ్ వివాదం... భార్యను చంపిన భర్త... యాసిడ్ తాగించి...

ప్రధాని అభ్యర్థిగా శరద్ పవార్... తెరపైకి కొత్త సమీకరణలు...

23న ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం... లెక్క త్వరగా తేలదంటున్న అధికారులు...

చంద్రబాబులో పెరిగిన ధీమా... సమీక్షలకు సన్నద్ధం... ఆ జిల్లాపై ప్రత్యేక దృష్టి
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>