Home /News /andhra-pradesh /

LANCE NAIK SAI TEJA DEAD BODY WILL ARRIVAL TO DAY EVENING BUT FUNERALS TOMORROW ONLY NGS TPT

Sai Teja: ఢిల్లీ నుంచి బయలుదేరిన సాయితేజ పార్ధీవదేహం.. ఏపీ ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం.. చివరి కోరిక తీరుస్తానన్న తమ్ముడు

Sai Teja:

Sai Teja:

Lance Naik Sai Teja: లాన్స్ నాయక్ సాయి తేజ భౌతిక కాయం ఢిల్లీలో బయలు దేరింది. అయితే అంత్యక్రియలు మాత్రం రేపు చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది.

  Sai Teja: యావత్ భారత దేశంలో విషాదం నింపింది గత బుధవారం సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ (CDS General Bipin Ravath) భార్య మధులిక (Madhulika)తో సహా 13 మంది తమిళనాడులోని కూనూర్‌ లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం (Helicopter crash). సైనిక లాంఛనాల మధ్య శుక్రవారం బిపిన్‌ రావత్‌, మధులికల అంత్యక్రియలు జరిగాయి. వీరితో పాటు మృతిచెందిన సైనికుల మృతదేహాలను గుర్తు పట్టడం కష్టంగా మారింది. దీంతో వారిని గుర్తుపట్టేందుకు ఆర్మీ అధికారులు డీఎన్‌ఏ టెస్టులు (DNA Test) చేసి వారివారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ పార్థీవదేహం నేడు ఢిల్లీ నుంచి బయలు దేరింది. ఈ రోజు సాయంత్రానికి సాయితేజ భౌతిక కాయం చిత్తూరు  జిల్లా (Chitoor District)కు చేరుకోనుంది.సాయితేజ ఆస్పత్రిలో పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించి.. మిలటరీ లాంఛనాలతో సాయితేజ స్వస్థలానికి భౌతికకాయాన్ని తరలించారు. అయితే ఇవాళ అంత్యక్రియలు నిర్వహించలేమని రేపు నిర్వహిస్తామని సాయి తేజ  (Sai Teja)కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రేపు ఉదయమే సాయితేజ భౌతికకాయాన్ని తమకు ఇవ్వాలంటూ సాయితేజ బాబాయి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్మీ అధికారులను కోరామని సాయితేజ బాబాయి సుదర్శన్‌ వెల్లడించారు.

  మరోవైపు నీలగిరి కొండల్లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లా ఎగువరేగడకు చెందిన లాన్స్‌నాయక్‌ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. 50 లక్షలు అందించాలని ఏపీ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ఏపీ ప్రభుత్వం అన్ని విధాల కుటుంబానికి అండగా ఉంటుంది అన్నారు మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.. 50 లక్షల రూపాయల చెక్ ను అందజేశారు.

  ఇదీ చదవండి: కృష్ణానదిలో విషాదానికి కారణం ఇదే.. వారి కుటుంబాలకు అండగా శారదా పీఠం

  తన ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని నేను చూసుకుంటానంటున్నారు లాన్స్ నాయక్ సాయి తేజ సోదరుడు మహేష్.సాయితేజ లేని లోటు తమ కుటుంబానికి తీరని లోటని అని సాయి సోదరుడు మహేష్‌బాబు అన్నారు. అన్న స్ఫూర్తితోనే తాను ఆర్మీలోకి వెళ్లాషనని మహేష్‌ తెలిపారు. అన్నకు పిల్లలంటే ఎంతో ఇష్టమని, వారిని తాను బాగా చూసుకుంటానన్నారు. ఆర్మీలో అన్న ఎంతో కష్టపడి పనిచేశాడని, బిపిన్ రావత్ మన్ననలు పొందాడన్నారు. అందుకే తన వ్యక్తిగత భద్రతకు అన్నయ్యను నియమించుకున్నారని సాయితేజ సోదరుడు కన్నీటి పర్యంతం అయ్యాడు. సాయితేజ సోదరుడు మహేశ్‌బాబు కూడా జవానే. ప్రస్తుతం మహేశ్‌ సిక్కింలో పనిచేస్తున్నారు.

  ఇదీ చదవండి: వైభవంగా మంత్రి బొత్స కుమారుడి ఎంగేజ్ మెంట్..? మెగాస్టార్ సహా ప్రముఖుల హాజరు

  కడసారి చూపు కోసం అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పరామర్శకు ఎవరు వచ్చినా ‘అయ్యా.. నా బిడ్డ ఇంకా రాలేదు’ అంటూ విలపిస్తున్న తల్లి భువనేశ్వరిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సాయితేజ మృతదేహం రాక కోసం రేగడపల్లె, కురబలకోట, బి.కొత్తకోట మండలాల్లోని పలు గ్రామాలు ఎదురు చూస్తున్నాయి. సాయితేజ గురించి తెలిసిన వాళ్లు, ముఖ్యంగా సైనిక ఎంపిక కోసం శిక్షణ పొందిన వారు విలపిస్తున్నారు. సాయితేజ ఇచ్చిన శిక్షణతో ఎంతోమంది సైనికులుగా ఎంపికయ్యారు. వారంతా అతడికి నివాళులర్పించేందుకు మృతదేహం కోసం నిరీక్షిస్తున్నారు. దీంతో రేగడపల్లెలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Army, Army Of The Dead, Chitoor

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు