హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Lalu Prasad Yadav Health: అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

Lalu Prasad Yadav Health: అత్యంత విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

లాలూ ప్రసాద్ యాదవ్ (File)

లాలూ ప్రసాద్ యాదవ్ (File)

Lalu Prasad Yadav Health: కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు.

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు. ఆయన కూతురు మీసా భారతి తన తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు రిమ్స్ చేరుకున్నారు. లాలూ కిడ్నీలు 75 శాతం చెడిపోయాయని రిమ్స్ డాక్టర్లు తెలిపారు. పరిస్థితిని బట్టి ఆయనకు డయాలలిస్ చేస్తామని వెల్లడించారు. మరోవైపు లాలూ చిన్నకుమారుడు బీహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్, లాలూ సతీమణి రబ్రీ దేవి ప్రత్యేక విమానంలో పాట్నా నుంచి రాంచీ చేరుకోనున్నారు.

ఇక లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం ఆందోళకరంగా ఉందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ ఉమేశ్ ప్రసాద్ గత నెలలోనే తెలిపారు. ఆయన కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తున్నాయని.. పరిస్థితి ఏ క్షణంలోనే అయినా విషమించే అవకాశం ఉందని అన్నారు. ఈ విషయాన్ని లాలూ చికిత్స పొందుతున్న రాంచీలోని రిమ్స్ అధికారులకు ఉమేశ్ ప్రసాద్ రాతపూర్వకంగా తెలియజేశారు.లాలూ కిడ్నీలు కేవలం 25 శాతం మాత్రమే పని చేస్తోందని తాను గతంలోనే చెప్పాలని ఉమేశ్ ప్రసాద్ అన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎప్పుడైనా విషమించవచ్చని అన్నారు.లాలూ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆయనను మరో ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని అన్నారు. డయాబెటిస్ కారణంగా అవయవాలు దెబ్బతిన్న వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఎలాంటి మందులు లేవని అన్నారు.

ఇదిలా ఉంటే పశు దాణా కుంభకోణం కేసులో లాలూ బెయిల్ పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు జనవరికి వాయిదా వేసింది. రెండేళ్ల క్రితం ఆగస్టు 30, 2018న లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం కారణంగా రిమ్స్‌లో చేరారు. గత అక్టోబర్‌లో లాలూకు చైబాసా ట్రెజరీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ.. దమ్కా ట్రెజరీ కేసులో బెయిల్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. డిసెంబర్ 2017న ఆయనకు పశు దాణా కేసులో ఏడేళ్ల శిక్ష పడింది. 1991 నుంచి 1996 మధ్య కాలంలో లాలూ సీఎంగా ఉన్న సమయంలో దమ్కా ట్రెజరీ నుంచి రూ. 3.5 కోట్లు అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష పడింది.

First published:

Tags: Lalu Prasad Yadav

ఉత్తమ కథలు