Home /News /andhra-pradesh /

LAKSHMIS NTR RELEASED IN SRIKAKULAM POLICE FILES CASE ON THEATRE SB

ఏపీలో విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’...శ్రీకాకుళం జిల్లాలో ప్రదర్శన

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల

ఈ సినిమాను శ్రీకాకుళం జిల్లాలో విడుదలైంది. పాలకొండలో ఓ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు.

    తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఏపీలో కూడా వేడి రాజేస్తోంది. మే 1న ఏపీలో సినిమా విడుదల చేయాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందను సినిమాను రిలీజ్ చేయలేమని అధికారులు తెలిపారు. దీనిపై వర్మ పెద్ద ఫైటే చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ లో విడుదల కావాల్సిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమాను శ్రీకాకుళం జిల్లాలో విడుదలైంది. పాలకొండలో ఓ థియేటర్లో ఈ సినిమాను ప్రదర్శించారు. పట్టణంలోని శ్రీరామా కళామందిర్, శ్రీసాయి కళామందిర్ జంట థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. దీంతో భారీ ఎత్తున ప్రేక్షకులు
    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం చూసేందుకు తరలివచ్చారు.

    అయితే సినిమాను ప్రదర్శిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన థియేటర్‌కు చేరుకున్నారు. సినిమాను మధ్యలోనే నిలిపివేయించారు. దీంతో పోలీసుల తీరుపై అభిమానులు ఫైర్ అయ్యారు. ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ కారణంగా సినిమా విడుదల ఆగిపోయినా, చిత్రాన్ని ప్రదర్శించినందుకు థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. మొత్తంమీద వర్మకు మాత్రం ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల కాకుండా ఇబ్బందులు పెడుతోంది.
    First published:

    Tags: Andhra Pradesh, Lakshmis NTR, Laxmi's NTR, Ram Gopal Varma, Srikakulam

    తదుపరి వార్తలు