Home /News /andhra-pradesh /

LAKSHMI PARVATI ALLEGES CHANDRABABU NAIDU STOPPING LAKSHMIS NTR RELEASE IN AP

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలను అడ్డుకుంటున్నారు...చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి ఫైర్

లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)

లక్ష్మీ పార్వతి ( ఫేస్ బుక్ ఫోటో)

Lakshmi's NTR Movie | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదలకాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఆరోపించారు.

    ఎన్టీఆర్‌పై రాంగోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో విడుదలకాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా కోర్టుకు వెళ్లి నానా ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడ సినిమా విడుదలకు ఇబ్బందులేంటని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరుతో విజయవాడలో రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్ పెట్టకుండా ఇబ్బందులు పెట్టారని అన్నారు. చంద్రబాబు నాయుడిది మొదటి నుంచీ అడ్డదారి రాజకీయాలేనని ఆమె ఎద్దేవా చేశారు.

    చంద్రబాబు అరాచక పాలన త్వరలోనే అంతం అవుతుందని లక్ష్మీ పార్వతి అన్నారు. పాపాల భైరవుని పండే రోజులు దగ్గరపడ్డాయని, దోపిడీ పరిపాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి రానుందని చెప్పారు. ఈ నెల 23న ఏపీ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రానుందన్నారు. వైసీపీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తంచేశారు.
    First published:

    Tags: Lakshmi Parvathi, Lakshmis NTR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు