హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Unstoppable 2: ఛీ ఇన్ని అబద్దాలా..? బాలయ్య తీరుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Unstoppable 2: ఛీ ఇన్ని అబద్దాలా..? బాలయ్య తీరుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

బాలయ్య, చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

బాలయ్య, చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Unstoppable 2: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్‌స్టాపబుల్‌-2 షో తొలి ఎపిసోడ్ సంచలనం కొనసాగుతోంది. ఎన్నోఏళ్ల నుంచి అనుమానంగా ఉండిపోయిన ప్రశ్నకు సమాధానం దొరికిందని కొందరు అంటే..? ఛీ అన్నీ అబద్ధాలే అని మరికొందరు అంటూన్నారు. ఈ ఎపిసోడ్ పై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Unstoppable 2: ఆంధ్ర్ర ప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో 1995 ఇష్యూ మరోసారి సంచలనంగా మారింది. ఇంతకాలం ఆ రోజు ఏం జరిగింది అంటూ.. అనుమానాలు.. ఆరోపణలు ఉన్నాయి. కానీ ఈ ఘటనపై ఇటు నారా కుటుంబం కానీ.. అటు నందమూరి కుటుంబం కానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తొలిసారి  స్వయంగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), బాలయ్య  స్పందించారు. ఆ రోజు ఏం జరిగింది అంటూ వివరణ ఇచ్చారు. దీంతో చాలా వరకు ఉన్న అనుమానాలకు వారు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సమయంలో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన సమయంలో కీలక పరిణామాలను చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పార్టీ పెట్టి పోరాడి ముందుకెళ్లారని, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పి పనిచేశామని అన్నారు.

ఆ ఘటనపై చంద్రబాబు ఏమన్నారంటే..? 1995 సంవత్సరంలో తీసుకున్న నిర్ణయం కీలకమైనదని, ఆ సమయంలో ఎమ్మెల్యేలు కొంతమంది ఎన్టీఆర్ నిర్ణయంపై రివర్స్ అయ్యారని చంద్రబాబు తెలిపారు. తనతో పాటు బాలకృష్ణ (Balakrishna) , హరికృష్ణ (Harikrishna), కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లామని బాలయ్యకు జరిగిన ఘటన గుర్తు చేశారు. ఫ్యామిలీ అయితే మీ ముగ్గురు ఉండండి, రాజకీయం అయితే తనని ఒక్కడినే ఉండమన్నారని.. మీరంతా బయటకి వెళ్లిపోయిన తరువాత.. మూడు గంటలు ఎన్టీఆర్‌తో మాట్లాడానని... సమస్యలు చెప్పానని, మీటింగ్ పెట్టమన్నానని.. ఆయన కాళ్ళు పట్టుకున్నాను అన్నారు. అయినా ఆయన వినలేదు అంటూ చంద్రబాబు చెప్పారు.

తనది.. ఎన్టీఆర్‌ది రామాంజనేయ యుద్ధమని అన్నారు. అయనకంటే అయన సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అంటూ చంద్రబాబు బాలకృష్ణ‌ను తిరిగి ప్రశ్నించారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవమని, ఆయనకి నా మీద నమ్మకం ఉంది. ఇది చరిత్ర అంటూ చంద్రబాబు అన్నారు..

ఇదీ చదవండి : నేడు విశాఖకు పవన్.. అటు గర్జనతో హీటెక్కిన రాజకీయం.. ఏ జరగనుంది?

చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించిన బాలకృష్ణ.. నందమూరి కుటుంబ సభ్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, అభిమానిగా చెప్తున్నా.. మీరు తీసుకున్న నిర్ణయం కరక్ట్ అంటూ మద్దతుగా నిలిచారు. ఈ షో రాజకీయంగా సంచలనాలకు వేదికైంది. ఈ షోలో చంద్రబాబు, బాలకృష్ణ సంభాషణలపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి స్పందించారు.

ఇదీ చదవండి : ఆ ఫోటోలు మార్ఫింగ్ కాదు.. మంగళగిరిలో ఓటమికి కారణం అదే.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్ పై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని, ఎంత కక్ష లేకుంటే ఆయనపై చెప్పులేయిస్తారని అన్నారు. చంద్రబాబు అబద్దాల కోరని అందరికీ తెలుసు, ఎన్టీఆర్‌కు మరోసారి బాలకృష్ణ మోసం చేస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. బాలకృష్ణ కంటే చంద్రబాబు పెద్ద నటుడుగా మారాడని, పార్టీ ఆఫీస్‌లో ఎన్టీఆర్ ఫొటోలు తీసి బాత్ రూమ్‌లో వేసిన ఘటనలు చంద్రబాబు మర్చిపోయి ఉంటాడంటూ కౌంటర్ ఇచ్చారు. అసలు బాలయ్య తండ్రి గురించి మాట్లాడిన తీరు చూస్తే అసహ్యం వేస్తోంది అన్నారు.

ఇదీ చదవండి : శ్రీవారికి విరాళాల వెల్లువ.. ఈ నెల రోజుల్లో వచ్చినవి ఇవే.. రికార్డు స్థాయి నగదు.. ఎంతంటే?

చంద్రబాబుకు ఎన్టీఆర్ అంటే గౌరవంలేదన్నారు. అలాగే చంద్రబాబు పరమ దుర్మార్గుడంటూ ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల కంటే ముందే ఎన్టీఆర్‌పై చంద్రబాబు కుట్ర చేశారని, చెప్పులు వేయించి మరీ అవమానపర్చారని అన్నారు. ఆ విషయాలు బాలకృష్ణ కు తెలుసన్నారు. అయితే ఇద్దరు పచ్చిగా అబద్ధాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Chandrababu Naidu, Lakshmi Parvathi, Unstoppable With NBK S2

ఉత్తమ కథలు