ఎందుకంటే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రెస్ మీట్లో కనిపించి సందడి చేసిన లక్ష్మీ పార్వతి అకస్మాత్తుగా ఎందుకు వర్మకు మొహం చాటేశారని అంతా చర్చించుకుంటున్నారు.
రామ్ గోపల్ వర్మ... సంచలనాలకు కేరాఫ్ అడ్రాస్. ఆయన ఏం చేసినా కాంట్రోవర్సీయే అవుతోంది. తాజగా వర్మ తీసుకున్న ఓ నిర్ణయం కూడా విజయవాడలో ఉద్రిక్త పరిస్థితుల్ని తీసుకొచ్చింది. ఆదివారం సాయంత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెడతానంటూ వర్మ ట్విట్టర్లో పోస్టు చేశారు. అయితే వర్మ విజయవాడ చేరుకోగానే... పోలీసుల్నిఆయనను అడ్డుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోమన్నారు. అయితే వర్మ తాజాగా తెరపైకి తీసుకొచ్చిన ఈ వివాదంతో మరో అంశం తెరపైకి వచ్చింది. వర్మ బెజవాడలో పెడుతున్న ప్రెస్ మీట్‌కు రావాలని లక్ష్మీ పార్వతిని కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. అయితే వర్మ ఆహ్వానాన్ని లక్ష్మీ పార్వతి సున్నితంగా తిరస్కరించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రెస్ మీట్లో కనిపించి సందడి చేసిన లక్ష్మీ పార్వతి అకస్మాత్తుగా ఎందుకు వర్మకు మొహం చాటేశారని అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాదు... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆమెకు పెద్దగా నచ్చలేదా అన్న సందేహాలు కూడా చాలామంది వ్యక్తంచేస్తున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ విడుదలైన సందర్భంగా అది చూసిన లక్ష్మీపార్వతి వర్మపై ప్రశంసలు కురిపించారు. "నా జీవితంలో జరిగింది. 23 ఏళ్లు అయినా... ప్రతిక్షణం, ప్రతిమాట, ప్రతి చర్యా గుర్తుంది నాకు. అవి గుర్తున్నాయి కనుకనే నేనీ విధంగా నిలబడివుండగలిగాను. నిజంగా వర్మగారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అని పేర్కొన్నారు. సినిమా తీసే సమయంలో నిజంగా తనను వర్మ సంప్రదించలేదన్నారు. కనీసం మీరేమైనా చెబుతారా? అని నన్ను అడగలేదన్నారు లక్ష్మీ పార్వతి. మరి అప్పుడు అలా అని... ఇప్పుడు వర్మ పిలిస్తే ప్రెస్ మీట్‌కు వెళ్లకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అభిమానులు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.