Home /News /andhra-pradesh /

LAGADAPATI RAJAGOPAL PRESENTS GOLD CHAIN TO VIJAYAWADA GODDESS KANAKA DURGA IN LUEW OF HIS DAUGHTER MARRIAGE NK

విజయవాడలో లగడపాటి రాజగోపాల్ సందడి... ఏం చేశారంటే...

విజయవాడలో లగడపాటి రాజగోపాల్ సందడి... ఏం చేశారంటే...

విజయవాడలో లగడపాటి రాజగోపాల్ సందడి... ఏం చేశారంటే...

Andhra Pradesh | Vijayawada : 2017లో ఇదివరకు తన కొడుక్కి పెళ్లి చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... ఇప్పుడు తన కూతురి వివాహ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

    Andhra Pradesh | Vijayawada : కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరమైన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్... అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన... విజయవాడలో సందడి చేశారు. ఈ నెల 8న (ఆదివారం) తన కూతురు పూజ నిశ్చితార్థం జరగబోతుండటంతో... ఈ నెల 7న (శనివారం) ఆయన... బెజవాడలో కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన లగడపాటి ఫ్యామిలీ... అమ్మవారికి కానుకహా హారాన్ని సమర్పించారు. కూతురి పెళ్లి ఘనంగా జరిగేలా దీవించమని అమ్మవారిని కోరుకున్నారు. ఇలా లగడపాటి... ఇంద్రకీలాద్రిపై కనిపించడంతో... కాసేపు అక్కడ సందడి వాతావరణం ఏర్పడింది. 2017లో కొడుకు పెళ్లిని హైదరాబాద్ హైటెక్స్‌లో అట్టహాసంగా జరిపించారు రాజగోపాల్. ఇప్పుడు కూతురి పెళ్లిని కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

    విజయవాడలో లగడపాటి రాజగోపాల్ సందడి... ఏం చేశారంటే...


    విజయవాడలో లగడపాటి రాజగోపాల్ సందడి... ఏం చేశారంటే...


    ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో లగడపాటి రాజగోపాల్... తనదైన సర్వే జరిపించారు. ఆ సర్వేలో... వైసీపీ గట్టి పోటీ ఇస్తుందనీ, టీడీపీ గెలిచే అవకాశాలున్నాయని చెప్పారు. తీరా ఫలితాలు వచ్చాక... లగడపాటి సర్వేలో ఏమాత్రం నిజం లేదనీ... పూర్తి విరుద్ధమైన సర్వే అని వైసీపీ నేతలు భగ్గుమన్నారు. ఆల్రెడీ రాజకీయాలకు దూరమైన లగడపాటి... ఈ సర్వే ఫలితంతో పూర్తిగా కనుమరుగయ్యారు. ఐతే... ఆయనకు రెండు పార్టీల్లోనూ, రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ మిత్రులున్నారు. కూతురి పెళ్లి సందర్భంగా... ఆయన ఎవరెవర్ని పిలుస్తారన్నది త్వరలో తెలుస్తుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: AP News, Lagadapati

    తదుపరి వార్తలు