అమరావతిపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు... ఏమన్నారంటే...

Lagadapati Survey : ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించే ఒక రోజు ముందు ప్రెస్ మీట్ పెట్టిన లగడపాటి అమరావతిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 19, 2019, 10:26 AM IST
అమరావతిపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు... ఏమన్నారంటే...
మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్
  • Share this:
AP Assembly Election 2019 : ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజధాని అమరావతిపై పెద్ద చర్చే జరిగింది. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, రాజధానిగా అమరావతే ఉంటుందనీ, అదే వైసీపీ అధికారంలోకి వస్తే, రాజధానిని మరో చోటికి తరలిస్తారనే ప్రచారం జరిగింది. రాజధానిని తరలించే ప్రసక్తే లేదని వైసీపీ అధినేత జగన్ స్వయంగా ఎన్నికల ప్రచారంలో ప్రకటించినా... కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల్లో మాత్రం ఒకింత ఆందోళన అలాగే ఉండిపోయింది. తాజాగా ఏపీలో ఈసారి సైకిల్ (టీడీపీ) ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపారని చెప్పడంతో... మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందన్న సంకేతాలిచ్చారు మాడీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌గా పిలిచే లగడపాటి రాజగోపాల్. అందువల్ల ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని స్పష్టం చేశారు రాజగోపాల్.

వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు రాజగోపాల్. పాండవుల రాజధాని ఇంద్రప్రస్థాన్ని తలపించేలా అమరావతి నిర్మాణమవుతోందని లగడపాటి అన్నారు. కేవలం అమరావతిని చూడటానికే టూరిస్టులు వచ్చే రోజులు రాబోతున్నాయని చెప్పారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతులు దిగులుపడొద్దని తెలిపారు. అమరావతికి తాను వస్తున్న సమయంలో మధ్యలో ఓ చోట రైతులు తనను ఆపారనీ, రాజధానిగా అమరావతి ఉంటుందా, మారుతుందా అని అడిగితే... అమరావతే ఉంటుందని తాను చెప్పినట్లు వివరించారు లగడపాటి.

రాజధాని నిర్మాణం, నీటిప్రాజెక్టులు, సరైన నెట్ వర్క్ ఉన్న రోడ్లు వేగంగా నిర్మాణమవుతున్నాయని అన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం కాబోతోందని.. చుట్టూ కొండలు, పక్కన నదితో అద్భుతంగా ఉందన్నారు. ఢిల్లీలో యమున ఉన్నా.. నీళ్లు ఉండవనీ.. కానీ అమరావతిలో అలా కాదన్నారు. మయసభను తలపించేలా అసెంబ్లీ నిర్మాణం కాబోతుందన్నారు. అసూయపడేలా ఈ ప్రాంత అభివృద్ధి ఉంటుందన్నారు. మొత్తానికి లగడపాటి చెప్పిన అన్ని విషయాలూ టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. నేటి సాయంత్రం ఆయన ఇవ్వబోయే అంచనా ఫలితాలపై అందరి దృష్టీ ఉంది.

 ఇవి కూడా చదవండి :

లోక్ సభ స్థానాలపై చంద్రబాబు రిపోర్ట్... టీడీపీకి ఎన్ని? వైసీపీకి ఎన్ని?

నారా లోకేష్ హ్యాపీ... లగడపాటి సర్వేతో గెలుపుపై పెరిగిన ధీమాలగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?
First published: May 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>