విశాఖలో కరోనా కలకలం.. ఆస్పత్రిలో యువతికి చికిత్స

కొన్ని రోజులగా ఆమె జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఛాతీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వైద్య పరీక్షల వివరాలు, నమూనాలు పరిశీలన నిమిత్తం పంపించారు.

news18-telugu
Updated: February 18, 2020, 9:23 PM IST
విశాఖలో కరోనా కలకలం.. ఆస్పత్రిలో యువతికి చికిత్స
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖపట్టణంలో కరోనా కలకలం రేగింది. కోవిడ్-19 (కరోనావైరస్) లక్షణాలతో 18 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం ఆమెకు ఛాతీ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న ఆ యువతి.. గతవారం చైనా నుంచి బ్యాంకాక్ మీదుగా విశాఖకు వచ్చింది. కొన్ని రోజులగా ఆమె జ్వరం, దగ్గుతో బాధపడుతోంది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో ఛాతీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె వైద్య పరీక్షల వివరాలు, నమూనాలు పరిశీలన నిమిత్తం పంపించారు. ఆ రిపోర్టుల కోసం డాక్టర్లు ఎదురుచూస్తున్నారు.

మరోవైపు చైనాలో కోవిడ్-19 వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ కారణంగా చైనాలో ఇప్పటి వరకు 1871 మంది చనిపోయారు. 72,500 వేల మంది వైరస్ బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. రోగులనే కాదు వారికి చికిత్స అందిస్తున్న వైద్యులను కూడా కరోనా కబలిస్తోంది. కరోనావైరస్‌ను తొలిసారి గుర్తించిన వైద్యుడు ఇప్పటికే చనిపోగా.. తాజాగా వూహాన్ సిటీలో ఉచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియూ జిమింగ్ మరణించాడు. ఇక చైనా కాకుండా ఇతర దేశాల్లో ఇప్పటి వరకు 46,997 కరోనా కేసులు నమోదయ్యాయి.First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు