తిరుమల భక్తులకు షాక్.... శ్రీవారి లడ్డూ ధర పెంపు ?
భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. ఆపైన ప్రతి లడ్డూ రూ.50కి విక్రయించేలా ప్రణాళిక సిద్దం చేస్తోంది.
news18-telugu
Updated: November 13, 2019, 9:07 AM IST

లడ్డూ ప్రసాదం
- News18 Telugu
- Last Updated: November 13, 2019, 9:07 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై స్వామి వారి లడ్డూను అధిక ధరకు విక్రయించాలన్న ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. లడ్డూ పంపిణీ, విక్రయాల్లో రాయితీలన్నింటినీ రద్దు చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది. ఆపైన ప్రతి లడ్డూ రూ.50కి విక్రయించేలా ప్రణాళిక సిద్దం చేస్తోంది. మార్కెట్ ధర ప్రకారం లడ్డూ తయారీకి సుమారు రూ. 40 ఖర్చు అవుతోంది. వీటిపై ఎక్కువమంది భక్తులకు రాయితీ టీటీడీకి భారీ నష్టం వస్తోంది. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్షలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. దీనికి అందరూ సుముఖత తెలపడంతో ఈ అంశాన్ని టీటీడీ పాలకమండలికి నివేదించుకున్నట్లు సమాచారం. రాయితీ లడ్డూవల్ల ప్రతీ ఏటా రూ.2412 కోట్ల నష్టం వస్తున్నట్లు టీటీడీ లెక్కలు వేస్తోంది.
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
పవన్ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సపోర్ట్...
వైసీపీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం
Loading...