T. Murali Krishna, News18, Kurnool
అక్కడ మైనింగ్ తవ్వకాలపై అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం... దమ్ముంటే సాక్షాలతో సహా రుజువు చేయాలంటూ సవాల్ విసిరినఅధికార వైయస్సార్సీపి పార్టీ కార్పొరేటర్లు. తమ నాయకుడు కాటసాని రాంభూపాల్ రెడ్డిపై సాక్షాదారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే తాటతీస్తామంటూ హెచ్చరికలు చేశారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా అధికారుల అండతో కొండలు కరుగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా పత్తికొండ, డోన్, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఖనిజా నిక్షేపాలు ఉన్న కొండలు మెల్ల మెల్లగా కరిగిపోతున్నాయి. అధికారులు తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారే తప్ప గట్టి చర్యలు తీసుకోవటం లేదు. డోన్, బనగానపల్లి పరిధిలో 57 వేల హెక్టార్ల వరకు అటవీ భూములున్నాయి. డోన్ అటవీ పరిధిలో ఐదు సెక్షన్లు, 15 బీట్లు ఉన్నాయి. బనగానపల్లి అటవీరేంజ్ ఇటీవలే ఏర్పాటు చేశారు. డోన్, బనగానపల్లి ప్రాంతాలు విలువైన ఖనిజాలకు పుట్టిల్లు. ఇక్కడ ప్రభుత్వ భూముల్లో పలుచోట్ల మైనింగ్‌శాఖ అనుమతులతో తవ్వకాలు సాగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళల్లో, గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు చేపడుతూ విలువైన ఖనిజాలు తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనేకర్నూలు పట్టణ పరిధిలోని జగన్నాథ గట్టు సమీపాన ఉన్న కొండను తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని టిడిపి పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే దంపతులు చేత రెడ్డి తదితరులు అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసానిపై ఆరోపణలు చేస్తూ ఆందోళన చేపట్టారు. వారు చేసిన ఆరోపణలను ఖండిస్తూ అధికార పార్టీ కార్పొరేటర్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి పై గౌరు దంపతులు చేసిన ఆరోపణలను వైసీపీ కార్పొరేటర్లు ఖండించారు.
గౌరు దంపతులు నిరాధారంగా ఆరోపణలు చేశారని, కొండకు సంబంధించి ఆర్డిఓ పర్మిషన్తో కృష్ణానగర్ ఫ్లైఓవర్, రైల్వే అండర్ పాస్ ఫ్లైఓవర్, వెంకటరమణ కాలనీ ఫ్లైఓవర్ కోసం గ్రావెల్ వాడుకున్నారు తప్ప ఎవరు కబ్జా చేయలేదని, ఇక్కడ అంతా పట్టాలున్న వారున్నారని, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్న బయటపెట్టాలని,ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకోబమని, కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని ఎప్పుడు ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే కాటసానిపై కబ్జారోపణలు కావాలనే చేస్తున్నారని కార్పొరేటర్లు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News