Home /News /andhra-pradesh /

YSRCP: ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారా..? పిలిచి క్లాస్ పీకడం ఖాయమా..?

YSRCP: ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సీఎం జగన్ చిక్కుల్లో పడ్డారా..? పిలిచి క్లాస్ పీకడం ఖాయమా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhra Pradesh: రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు కాస్త అదుపులో ఉండాలి.. అదీ అధికార పార్టీలో ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అలా కాకుండా ఎవరైనా నోరు జారితే మాత్రం చిక్కులు తప్పవు.

  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సున్నితమైన అంశాల విషయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలతో వివాదాలు కొనితెచ్చుకున్నట్లవుతోంది. గ‌తంలో ఆల‌యాల‌పై దాడుల వ్య‌వ‌హారంలో మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఎంత త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టాయో అంద‌రికీ తెలిసిందే..! అప్పుడు స్వ‌యంగా ముఖ్య‌మంత్రే నాని పిలిచి వారించాల్సిన ప‌రిస్థ‌తి వ‌చ్చింది. అయితే తాజాగా మరో వైసీపీ ఎమ్యెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి తీవ్ర ఇబ్బందులొకి నెట్టాయంటున్నారు ఆ పార్టీ నేత‌లు. ఆయ‌న వ్యాఖ్య‌లు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఒక వ‌రంగా మారాయంటున్నారు. క‌ర్నూల్ జిల్లా ఎమ్మిగ‌నూరు ఎమ్మెల్యే చెన్న‌కేశ‌వ‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జ‌గ‌న్ కు చిక్కులు తెచ్చిపెడుతున్నాయంటున్నారు ఆ పార్టీ నేత‌లు. స్వ‌త‌హాగా వివాధ ర‌హితుడైన చెన్న‌కేశ‌వ‌రెడ్డి జిల్లాలో త‌ప్ప పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటారు. ఆయ‌న ఉన్న‌ట్టుండి గోవ‌ధ నిషేధం అంశంపై వ్యాఖ్య‌లు చేసి ఇటు ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు అటు హిందుత్వవాదుల‌కు టార్గెట్ అవ్వ‌డంతోపాటు పార్టీ కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెట్టారు.

  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం చాలా స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది పడుతుంటే ఇప్పుడీ వ్యాఖ్యలు మరో కొత్త సమస్యకు కారణమయ్యాయని పార్టీలో చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే... ఇటీవల బ‌క్రీద్ సంద‌ర్బంగా గోవ‌ద అంశంపై స్థానిక బిజేపీ నేత‌ల‌కు, ముస్లిం సంఘాల‌కు మ‌ధ్య వివాధం చెల‌రేగింది. దీంతో ఆగ్ర‌హించిన ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డి మీడియాను పిలిచి మ‌రీ గోవ‌ధ అంశంపై వివాధ‌స్పంద వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు దేశంలో గోవ‌ద నిషేధం ఎత్తివేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.దీంతో ఒక్క‌సారిగ బిజేపీ తోపాటు రాష్ట్రంలో ఉన్న హిందుత్వ సంఘాలు ఆయ‌న‌పై ఒంటికాలితో లేచాయి. ఎప్పుడు వివాదాల‌కు దూరంగా ఉండే ఎమ్యెల్యే ఒక్క‌సారిగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయడంతో పార్టీ నేత‌లు కూడా షాక్ కి గురయ్యారు. దొరికిందే అవ‌కాశంగా ప్ర‌తిప‌క్ష‌పార్టీలు ఈ వ్యాఖ్య‌ల‌నుపై ర‌చ్చ చేయ‌డం స్టార్ట్ చేశాయి.

  ఇది చదవండి: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు వచ్చేది ఎప్పుడంటే..!


  ఇప్ప‌టికే ప్ర‌తి అంశంలో ప్ర‌తిప‌క్ష‌పార్టీ లు ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తో్న్న నేపధ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టిన‌ట్లు అయ్యాయి. దీంతో జ‌గ‌న్ ఇప్పుడు ఈ అంశంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది పార్టీలో ఉత్కంఠ‌గా ఉంద‌ని అంటున్నాయి పార్టీ వ‌ర్గాలు. చెన్న‌కేశ‌వ‌రెడ్డి మొద‌టి నుంచి ముక్కుసూటిగా మాట్లాడే మ‌నిషి..., తాను మనసులో ఏమనుకుంటున్నారో అది సీఎం జగన్ కైనా సరే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. అదే అల‌వాటులో ఆయ‌న ఈ వాఖ్య‌లు చేశార‌ని దాన్ని పెద్ద విష‌యంగా చూడాల్సిన అవ‌స‌రం లేదని పార్టీలో కొందరు నేతలంటున్నారు.

  ఇది చదవండి: నడిరోడ్డుపై నరమాంస భక్షకులు... పుర్రెను పీక్కుతింటూ హల్ చల్.. వీడియో వైరల్  మొత్తానికి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు పార్టీకి చాలా డామేజ్ చేయ‌డం కాకుండ ప్ర‌భుత్వాన్ని కూడా ఇర‌కాటంలో నెట్టాయంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

  మీ నగరం నుండి (కర్నూలు)

  ఆంధ్రప్రదేశ్
  కర్నూలు
  ఆంధ్రప్రదేశ్
  కర్నూలు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు