Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లా (Kurnool District) అధికార పార్టీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైంది. నేతల పనితీరును తెలుసుకునేందుకు ప్రత్యేకంగా జిల్లాల్లో సర్వే టీం రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వర్గపోరు ఉన్న నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై పూర్తి సమాచారం సేకరించే విధంగా రెండు బృందాలుగా విడిపోయి ప్రజల్లో ఏ నాయకుడిపై ఎవరికి ఎలా అంటే అభిప్రాయాలు ఉన్నాయో వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకునే విధంగా ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. జిల్లాలో పార్టీ గ్రాఫ్, అసంతృప్తి నేతలు, ఆశావాహులు, సెట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు పై ప్రజా సేకరణ చేపడుతుంది. జిల్లాలో వారం రోజులుగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కార్యకర్తలను అప్రమత్తం చేసి చక చక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సమాచారం.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ (AP CM YS Jagan) సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతి నియోజకవర్గ లోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విజయవంతం చేయాలని పార్టీ సూచించినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది.
ఉదాహరణకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Bugana Rajendranath Reddy) తన సొంత నియోజక వర్గంలో అభివృద్ధి పనులలో జాప్యం వహించడం అదే విధంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanuru Jayaram) సొంత నియోజకవర్గమైన ఆలూరు తదితర ప్రాంతాలలో కనీసం రోడ్ల మరమ్మతులు కూడా సరిగ్గా చేయకపోవడం వంటివి జరుగుతుండడంతో ప్రజల సైతం గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వెళ్లిన మంత్రులను అనేకసార్లు ప్రశ్నించడం ఇలాంటివి తరచూ జరుగుతుండడం ఈ పరిణామాలన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లడం వలన వీరిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలుపుతున్నట్లు సమాచారం.
అదేవిధంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కూడా వర్గ పోరు విభేదాలతో పార్టీ ప్రతిష్ట దిగజారిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే జరదోడి సుధాకర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా చైర్మన్ ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అటు నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే తోగురు అర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి (Byreddy Sidharth Reddy) వర్గీయులు ఇద్దరి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారాయి. ఈ పరిణామాలు అన్ని దృష్టిలో ఉంచుకొని సర్వే టీం ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే తో సుమారు 4గంటలపాటు ఈ టీం చర్చిస్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Ysrcp