Home /News /andhra-pradesh /

KURNOOL YOUNGMAN CHANGED HIS AUTO RISKSHAW INTO BATTERY VEHICLE HAS MANY SPECIALTIES FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool: చూడ్డానికి పాత ఆటోలా కనిపిస్తుందా..! కానీ లోపల చూస్తే వారెవ్వా అనాల్సిందే..!

బీచుపల్లి

బీచుపల్లి

గ్రామీణ ప్రాంతంలోని యువత వివిధ వృత్తుల్లో రాణిస్తూ వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఇంటింటా ఇన్నోవేటర్‌ (Intinta Innovator) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని… రాష్ట్ర ఇన్నోవేషన్ విభాగం నెల రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India
  Murali Krishna, News18, Kurnool

  గ్రామీణ ప్రాంతంలోని యువత వివిధ వృత్తుల్లో రాణిస్తూ వారిలో దాగున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఇంటింటా ఇన్నోవేటర్‌ (Intinta Innovator) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని… రాష్ట్ర ఇన్నోవేషన్ విభాగం నెల రోజుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన బీచుపల్లి రూపొందించిన ఎలక్ట్రికల్ ఆటో ఎంపికైంది. అయితే ప్రస్తుతం బీచుపల్లి కర్నూలులోనే నివాసం ఉంటున్నాడు. ఇలాంటి నూతన ఆవిష్కరణలకు భవిష్యత్తులో పెంటెంట్ హక్కలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే వీటికి మార్కెటింగ్ కల్పించే అవకాశాలు ఉన్నాయి. వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా.., బీచుపల్లికి ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.

  తెలంగాణ ప్రాంతానికి చెందిన బీచుపల్లి గత నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) లో నివాసం ఉంటూ. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజంతా ఆటో నడపగా.. వచ్చే డబ్బులు డీజిల్‌, ఆటో మెయింటెన్స్‌ ఖర్చులకే సరిపోతుందని..తనకు చివరకు రూ. 300 నుంచి 400 రూపాయలు మిగిలేదని బీచుపల్లి తెలిపాడు.

  ఇది చదవండి: రాజన్నకు లోపాలతో ఉన్న కోడెలను ఇస్తున్న భక్తులు: భక్తుల తీరుతో కొత్త చిక్కులు 


  రోజురోజుకు ధరలు ఆకాశాన్నంటుతుంటే…నిత్యావసర సరుకుల దగ్గర నుంచి పిల్లలకు కొనే పుస్తకాల వరకు అన్ని కాస్ట్‌లీనే. దీంతో వచ్చే అరకొర డబ్బులతో కుటుంబాన్ని పోషించలేనని గ్రహించిన బీచుపల్లి తన ఆటోకు అయ్యే డీజిల్‌ ఖర్చులను తగ్గించుకునే మార్గాన్ని ఆలోచించాలని అనుకున్నాడు. అనుకున్న తడవుగా ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు. తనకున్న డీజిల్ ఆటోను ఎలక్ట్రికల్ ఆటోగా మార్చి వారెవ్వా అనిపించాడు.

  ఇది చదవండి: బాలకృష్ణ-నరసింహస్వామి.. సెంటిమెంట్ మొదలైంది ఇక్కడే..! అందుకే అంత భక్తి..


  స్వతహాగా ఆటో డ్రైవర్ అయిన బిచుపల్లి తన సొంత డీజిల్ ఆటోను రూ.80,000 ఖర్చు చేసి మూడు బ్యాటరీలు అమర్చాడు. డీసీ పవర్‌తో నడిచేలా దీన్ని రూపొందించడతో ఎలాంటి షాక్ సర్క్యూట్ అవకాశం లేదు. ఒక్కసారి బ్యాటరీ అమర్చితే చాలు ఏడాది పాటు ఎలాంటి ఖర్చులేకుండా దీన్ని నడుపుకోవచ్చని బీచుపల్లి చెబుతున్నారు. దీని ద్వారా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 40 కిలోమీటర్ల వేగంతో 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని చెబుతున్నారు.

  ఇది చదవండి: టెడ్డీబేర్‌ కావాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..! రూ.50 నుంచి రూ.5000 వరకు అన్నిధరలలో దొరుకుతాయ్‌
  • ఆటో తయారీకి ఉపయోగించిన పరికరాలుఆటో తయారీకి ఉపయోగించిన పరికరాలు• 4 బ్యాటరీలు

  • 1000 వాట్స్ డీసీ మోటార్

  • 42 ఇంచెస్ డిఫరిన్సియల్

  • షాక్ అబ్సర్స్‌తో పాటుగా రెండు వైపులా బరువును మోసేందుకు వీలుగా హెవీ లోడ్ వెహికల్‌కు ఉపయోగించే పట్టాలు.

  • వెనుక భాగంలో 3.75/12 గల పొడవాటి టైరులు,

  • డిజిటల్ మీటర్ పవర్ సప్లై చేసేందుకు వీలుగా 60 volts కంట్రోలర్ అమర్చాడు.


  బీచుపల్లి ఇన్నోవేషన్‌ను మొదట్లో అందరూ ఇదేం పిచ్చిపనులు అంటూ వెక్కిరించినా… సక్సెస్‌ అయిన తర్వాత ముక్కునవేలేసుకున్నారు. అందుకే అంటారు ఎప్పుడూ ఎవ్వరి సామార్థ్యాన్ని తక్కువగా అంచనా వేయకూడదు అని.

  ఇది చదవండి: ఆగస్టు 15న కర్నూలులో ప్రత్యేకతలివే.. తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!


  ఫోన్‌ నెంబర్‌ : +91 63038 17977, బీచుపల్లి
  అడ్రస్‌ : పెద్దపాడు, రాజీవ్ గృహకల్ప, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ - 518003  ఎలా వెళ్లాలి?
  కర్నూలు నుంచి పెద్దపాడుకు 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కర్నూలు నుంచి బళ్లారి వెళ్లే దారిలో ఈ ఊరు వస్తుంది. ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Telangana

  తదుపరి వార్తలు