Murali Krishna, News18, Kurnool
కరోనా (Corona) మనిషి యొక్క జీవన విధానాన్ని మార్చేసింది. ఒకవైపు కరోనా వల్ల కొన్ని వందల వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్న. మరొకవైపు మన భారతదేశ సంస్కృతి (Indian Culture), సాంప్రదాయాలను అనుసరించి ఆహార ఉత్పత్తులను పెంపొందించుకునే విధంగా మార్చేసింది. చాలామంది కరోనా సమయం నుంచి వ్యవసాయం వైపు మగ్గుచూపుతున్నారు. యూట్యూబ్ లో కొన్ని డిజిటల్ మీడియాలో వచ్చే వ్యవసాయ పద్ధతులను అనుసరించి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను స్వయంగా పండించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ చేసేవాళ్లు కూడా ఈ మధ్య వ్యవసాయం చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండటంతో చాలా మంది ఖాళీ సమయాల్లో సాగు చేస్తూ అటు ఆరోగ్యం, ఇటు ఆదాయం సంపాదిస్తున్నారు.
ఇందులో భాగంగా కర్నూలు జిల్లా జొహరాపురం గ్రామానికి చెందిన బాల భాస్కర్ శర్మ వృత్తి రీత్యా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అయితే తన తండ్రి మరణానంతరం తమ గ్రామానికి వచ్చిన బాల భాస్కర్ శర్మ వారికున్న 8 ఎకరాల్లో వివిధ రకాలైన పండ్లు కూరగాయలను సాగు చేస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.
వర్క్ ఫ్రం హోం పేరుతో ఇంటి నుంచి ఒక వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే సుభాష్ పాలేకర్ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. తానే స్వయంగా నాలుగు ఆవులను పెంచుతున్నాడు.. ఆ పశువుల నుంచి వచ్చే పేడ, గో మూత్రం, మరియు ఇతర ఆకుల నుంచి తీసే కషాయలను తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నట్లు యువ రైతు చెబుతున్నారు.
ఈ పద్దతులన్నీంటి నిఅనుసరిస్తూ 20రకాలైన కూరగాయలు, వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఇతను పండించే పంటల్లో చెర్రీ టమాటో, ఎర్ర బెండ వంటి కూరగాయల, అరటిలో నాలుగు రకాలు, సుగంధాలు, ఎర్రగా ఉండే అరటి పండ్లు మామిడి పండ్లు, జామకాయలు వంటి ఎన్నో రకాలు సాగు చేస్తున్నాడు. వీటిని మార్కెట్ కు కాకుండా ప్యాక్ చేసి నేరుగా వినియోగదారులకే విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నాడు. తెలిసిన వారు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తే వారికి ప్యాక్ చేసి పంపిస్తుంటామని భాస్కర్ శర్మ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Kurnool, Local News, Organic Farming