హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: అమ్మాయి నుంచి వీడియో కాల్‌ వచ్చింది.. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే షాక్‌..! ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..!

Kurnool: అమ్మాయి నుంచి వీడియో కాల్‌ వచ్చింది.. ఎవరా అని లిఫ్ట్‌ చేస్తే షాక్‌..! ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..!

ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

ఈ మధ్యకాలంలో హనీ ట్రాప్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌ (Facebook), వాట్సాప్ (What’s App), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఫైటర్ వంటి వాటిల్లో పరిచయమై యువకులకు స్మార్ట్‌గా మోసాలు చేస్తున్నారు ఘరానా లేడీలు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఈ మధ్యకాలంలో హనీ ట్రాప్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫేస్‌బుక్‌ (Facebook), వాట్సాప్ (What’s App), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఫైటర్ వంటి వాటిల్లో పరిచయమై యువకులకు స్మార్ట్‌గా మోసాలు చేస్తున్నారు ఘరానా లేడీలు. వీడియో కాల్ చేసి తెలివిగా వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు మాయలేడీలు. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో హాని ట్రాప్ మరోసారి వెలుగులోకి వచ్చింది. పట్టణంలో నివాసం ఉంటున్న సునీల్ అనే యువకుడికి రాత్రి సమయంలో ఓ నంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసిన యువకుడికి ఒక్కసారిగా దిమ్మతిరిగింది. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన బట్టలు విప్పుతూ కాల్ మాట్లాడుతూ ఉండటంతో వెంటనే సునీల్ ఆ కాల్‌ కట్‌ చేశాడు.

  అయితే ఆ గ్యాప్‌లోనే అవతలి వైపు ఉన్న మహిళ వెంటనే.., సునీల్‌తో మాట్లాడిన కొద్దీ క్షణాలను రికార్డ్ చేసింది. న్యూడ్ మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు వీడియో క్రియేట్ చేసి సునీల్‌కు పంపారు. వెంటనే ఆ వీడియోను చుసిన సునీల్ ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. వెంటనే డబ్బులు ఇవ్వాలని లేకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ డిమాండ్ చేసింది. లేకపోతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మిత్రులకు పంపుతాను అంటూ మెసేజ్‌లు చేయడం మొదలుపెట్టింది. సునీల్ వద్దు వద్దు అంటూ వారిని ఎంత వేడుకున్నా ఆ మహిళా మాత్రం సునీల్‌కు చెందిన ఇద్దరు మిత్రులకు ఆ వీడియో పంపింది. ఇంక తన పరువు పోతుంది అని భయపడి ఏమి చేయాలో అర్థం కాక కుంగి పోయాడు.

  ఇది చదవండి: సాఫ్ట్ వేర్ జాబ్.. మంచి జీతం.. కానీ యువకుడి సమస్య అదే.. అందరూ చూస్తుండగానే ఘోరం

  ఇది ఇలా ఉండగా మరో వాట్సప్ నంబర్ నుండి మేము సిబిఐ అధికారులమంటూ వీడియో యూట్యూబ్‌లో వచ్చింది. వెంటనే డబ్బులు ఇచ్చి దాన్ని డిలేట్ చేయించుకో అంటూ బెదిరింపుల మెసెజ్ లు కూడా వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియక వెంటనే నగరంలోని పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులను వేడుకున్నాడు. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ల గురించి భయపడకుండా వచ్చి పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

  ఇది చదవండి: పెళ్లి చూపుల్లో ఆ మాట అనేసరికి తట్టుకోలేకపోయింది.. చేతి నిండా గాజులు వేసుకొని అంతపని చేసింది

  ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. ఓ యువకుడికి గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ చేసిన మహిళ.. క్రమంగా అతడితో పరిచయం పెంచుకుంది. మత్తుగా మాయమాటలు చెప్పి న్యూడ్ కాల్ చేయాలని అడిగింది. యువకుడు అలాగే చేయడంతో ఆ కాల్స్ రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తొలుత కొంత డబ్బులిచ్చిన యువకుడు.. ఆ తర్వాత వేధింపులు భరించలేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు