KURNOOL YOUNG MAN DIED IN AN ACCIDENT IN ITALY AS HE FELL DOWN IN THE SEA FULL DETAILS HERE PRN
Sad News: తీవ్ర విషాదం.. ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి.. త్వరలో ఇండియాకి వస్తాడనగా ఘోరం
తల్లిదండ్రులతో దిలీప్ (ఫైల్)
తల్లిదండ్రులను అత్యంత క్షోభకి గురి చేసే విషయం ఏంటో తెలుసా.. తమకంటే ముందు తమ పిల్లలు చనిపోవడం. అల్లారుముద్దుగా పెంచిన కొడుక్కి తండ్రే కొరివి పెట్టాల్సి రావడం. ఇంకొన్ని రోజుల్లో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం.
తల్లిదండ్రులను అత్యంత క్షోభకి గురి చేసే విషయం ఏంటో తెలుసా.. తమకంటే ముందు తమ పిల్లలు చనిపోవడం. అల్లారుముద్దుగా పెంచిన కొడుక్కి తండ్రే కొరివి పెట్టాల్సి రావడం. ఇంకొన్ని రోజుల్లో ఇంటికి వస్తాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. అలా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన కర్నూలు విద్యార్థి సముద్రం ఒడ్డుకి సరదాగా విహారయాత్రకి వెళ్లి ప్రాణాలే కోల్పోయాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు (Guntur) కు చెందిన శ్రీనివాసరావు, శారద దంపతులు 33 ఏళ్ల కిందట వ్యాపార నిమిత్తం కర్నూలులో స్థిరపడ్డారు. నగరంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న వీరికి దిలీప్, రేవంత్ ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రేవంత్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేసిన పెద్ద కుమారుడు దిలీప్ ఎంఎస్సీ అగ్రికల్చర్ కోసం ఇటలీ వెళ్లాడు. ఎంఎస్సీ పూర్తవడం.. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించడంతో స్నేహితులతో కలిసి శుక్రవారం ఇటలీలోని మాంటరుస్సో బీచ్‌కు విహారయాత్రకు వెళ్లి అక్కడి ఫొటోలను తల్లిదండ్రులకు షేర్ చేశాడు.
ఇంతలోనే అంతా అయిపోయింది..
ఎంఎస్సీ పూర్తయిందని ఉద్యోగం కోసం చూస్తున్నానని.. త్వరలోనే ఇండియాకి వస్తానన్న దిలీప్‌ను రాకాసి అలల రూపంలో మృత్యువు కబళించింది. విహారయాత్రకు వెళ్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడమే కాకుండా.. బీచ్ ఒడ్డున ఉన్న ఫొటోలను సైతం వారికి పంపించి ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత బీచ్‌లో నిలబడి ఉన్న అతడిని ఒక అల సముద్రం లోపలికి లాగేసింది. ఈ ఘటన భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. వెంటనే స్నేహితులు అక్కడున్న కోస్ట్‌గార్డులకు సమాచారం అందించగా.. నీటిలో చిక్కుకున్న దిలీప్‌ను ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు.
సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దిలీప్ కొద్దిసేపటికే మరణించాడు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు రాత్రి 2 గంటల సమయంలో తల్లిదండ్రుల తెలిపారు. దిలీప్ 2020-21 ఆగస్టులో ఇండియాకు వచ్చి ఇటలీ వెళ్లిపోయాడు. కర్నూల్లో తల్లిదండ్రులు కొత్త ఇల్లు నిర్మించుకొని ఈ నెల 6వ గృహప్రవేశం చేశారు. ఒక వారం రోజుల్లో స్వదేశానికి వస్తుండటంతో ఈ కార్యక్రమానికి దిలీప్ రాలేకపోయాడు.
ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్, ఇటలీ ఎంబసీతో మాట్లాడాలని తల్లిదండ్రులు వేడుకొంటున్నారు. ఈ మేరకు కలెక్టర్ కోటేశ్వరరావు, ఎస్పీ సుధీర్‌కుమార్, ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు శనివారం వినతిపత్రాలు సమర్పించారు. దిలీప్ మృతదేహాన్ని కర్నూలుకు తీసుకువచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.