Minor Girl: చాక్లెట్ ఇస్తానంటే అతడితో వెళ్లింది... కానీ వాడి మనసులో దురుద్దేశ్యం ఉందని ఊహించలేకపోయింది..,

ప్రతీకాత్మకచిత్రం

Minor Girl : వీధిలో ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారిపై కన్నేసిన యువకుడు.. చాక్లెట్ ఇస్తా రమ్మని పిలిచాడు. తెలిసినవాడు కావడంతో పాపం ఆ చిన్నారి ఆ మృగాడి మాటలు నమ్మింది.

 • Share this:
  GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

  కొందరు కామాంధులకు వయసుతో సంబంధం లేదు. వరసతో సంబంధం లేదు. ముక్కపచ్చలారని పసివాళ్ల నుంచి కాటికి కాళ్లు చాచిన వృద్ధుల వరకు ఎవర్నీ లెక్కచేయకుండా పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం ఎరుగని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. పెళ్ళై పిల్లలు ఉన్నా కోరిక తీరని కామ పిశాచుల్లా రెచ్చిపోతున్నారు. పసివాళ్లకు తినుబండారాలను ఆశచూపి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. దిశా, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని అమలవుతూ ఉన్న రాక్షసుల వెన్నులో వణుకు రావడంలేదు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కర్నూలు జిల్లా  (Kurnool District)లో చోటు చేసుసుంది. మృగాడిలా మారిన ఓ యువకుడు పసిమొగ్గ జీవితాన్ని నాశనం చేసేందుకు యచ్నించాడు. బాలిక తెలివిగా తప్పించుకొని తల్లిదండ్రులకు చెప్పడంతో అతడు కటకటాల పాలయ్యాడు.

  వివరాల్లోకి వెళితే.... కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కామినేని పల్లెలో నివాసం ఉంటున్నాడు లక్క అనిల్ కుమార్. ఇరుగు పొరుగుతో సన్నిహితంగా మెలిగి... పిల్లలతో చనువుగా ఉండేవాడు. పొరుగు ఇంటి వారు ఏమిచెప్పిన కాదనే వాడు కాదు. అయితే పసిపాపలను చెల్లెళ్లుగా చూస్తూ ఆడించాల్సిన వాడు కీచకుడిగా మారాడు. వారిపైనే కన్నేసే వాడు. ఎవరు లేని సమయంలో చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు.

  ఇది చదవండి: భయంకరమైన నిజాన్ని దాచి ఆమెకు పెళ్లి చేశారు.. ఏడాదిలోపే ఆమె జీవితం చీకటిమయమైంది..


  ఓ రోజు సాయంత్రం అనిల్ కుమార్ నివాసముంటున్న వీధికి చెందిన ఓ మైనర్ బాలిక వీధిలో ఆడుకుంటూ ఉంది. చుట్టుప్రక్కల ఎవరు లేరని గ్రహించిన అనిల్ కుమార్ చిన్నారిని దగ్గరకు రమ్మన్నాడు. చాక్లెట్ ఇస్తాను రమ్మంటూ ఇంటికి తీసుకెళ్లాడు. అది నమ్మిన బాలిక అనిల్ తో పాటు అతడి ఇంటికెళ్లింది. ఆ చిన్నారి అడిగినవన్నీ ఇస్తూనే ఆమె ఒంటిపై మెల్లగా చేతులు వేశాడు.

  ఇది చదవండి: ప్రియుడితో సహజీవనం... ఆతడికి తెలిసిన వారితో వ్యాపారం.. ఇంతలో కిడ్నాప్...


  దీంతో భయాందోళనకు గురైన బాలిక అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంటికెళ్లి బిగ్గరగా ఏడవడంతో ఏమైందని తల్లితండ్రులు అరా తీశారు. దీంతో జరిగిన విషయాన్ని తల్లితండ్రులకు చెప్పింది. ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశాడని చెప్పింది. దీంతో ఆ చిన్నారి తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనిల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

  ఇది చదవండి: రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు... ఫోటోలు వైరల్..


  ఇటీవల గుంటూరు జిల్లాలో ఓ యువతిని ప్రేమించిన యువకుడు.. ఆమెను తన రూమ్ కు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఐతే ఇద్దరూ ప్రేమలో ఉండటంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరింది. కానీ అతడు మాత్రం అప్పటికే తనకు వేరే అమ్మాయితో పెళ్లి కుదిరిందని.. నిన్ను పెళ్లి చేసుకోనంటూ యువతికి చెప్పాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకోని దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు.
  Published by:Purna Chandra
  First published: