హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CP vs TDP: భార్యకు అవమానం జరిగితే చంద్రబాబుకు ఎందుకు ఓట్లేయాలి.. చివరి ఎన్నికల కామెంట్ పై స్ట్రాంగ్ కౌంటర్లు

CP vs TDP: భార్యకు అవమానం జరిగితే చంద్రబాబుకు ఎందుకు ఓట్లేయాలి.. చివరి ఎన్నికల కామెంట్ పై స్ట్రాంగ్ కౌంటర్లు

చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్లు

చంద్రబాబుకు వైసీపీ నేతల కౌంటర్లు

YCP vs TDP: ఈ సారి తాను గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలు అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. మంత్రులు, కీలక నేతలు వరుస కౌంటర్లు వేస్తున్నారు. అవును చంద్రబాబు చెప్పింది నిజమే అని.. ఇదే ఆయనకు చివరి ఎన్నిక అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

YCP vs TDP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు వేడక్కాయి. అన్ని పార్టీలు దాదాపు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. తాజాగా కర్నూలు జిల్లా (Krunool District) లో చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యల దుమారం ఆగడం లేదు. తనకివే చివరి ఎన్నికలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విరామం లేకుండా కౌంటర్లు వేస్తున్నారు.  తనను ఈసారి గెలిపించకపోతే 2024 ఈ ఎన్నికలే చివరివని చంద్రబాబు ప్రజలను కోరారు. దీంతో ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు బ్రేక్ లేకుండా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.  ప్రస్తుతం చంద్రబాబు మరీ దిగజారిపోయి మాట్లాడుతున్నారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) విరుచుకుపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని మోపిదేవి వెంకట రమణ విమర్శించారు.

ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ తథాస్తు అన్నారు. చంద్రబాబు నెగిటివే మాట్లాడుతున్నారని, చంద్రబాబు కోరుకున్నట్లే ప్రజలు తీర్పు ఇస్తున్నారని ఎద్దేవ చేశారు. నిజంగా రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదన్నారు. ఆయన అధికారంలోకి వస్తే కరువు కాటకాలు వస్తాయని, చంద్రబాబు నిజంగానే ఇవే చివరి ఎన్నికలు అన్నారు బొత్స..

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. ఏం పీకావంటూ చంద్రబాబుని నిలదీశారు. చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ మళ్లీ కొత్త బిచ్చగాడిలా జనం మీద పడ్డావంటూ ఎద్దేవా చేశారు. కుల పిచ్చితో మూడు దశాబ్దాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావని, ఇక ఈ జన్మకి మళ్లీ ముఖ్యమంత్రి కాలేవని ఘాటుగా స్పందించారు.

ఇదీ చదవండి: తాడేపల్లి ప్యాలెస్ కు లారీల్లో డబ్బులు.. అభివృద్ధి ఆగి.. రౌడీయిజం పెరిగిందన్న చంద్రబాబు

చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబే కాదు, ప్రజలు కూడా అనుకున్నారని.. అందుకే 2019లోనే ఆయన్ను, టీడీపీని సాగనంపారని కౌంటర్ వేశారు. దింపుడు కళ్లెం ఆశలా ప్రజల్ని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదని తేల్చి చెప్పారు. తనకోసం ప్రజలు ఉన్నారని చంద్రబాబు భ్రమ పడుతున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : ఒకప్పటి స్టార్ హీరోయిన్.. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు.. ముద్దుగా ఉన్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా..?

ఒకటికి పదిసార్లు తన భార్యను ప్రజల్లో చెప్పి, చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని చెప్పారు. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు.. ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు సజ్జల విమర్శించారు. లేనివన్నీ చంద్రబాబే ప్రజలకు గుర్తు చేస్తున్నారన్నారు. ప్రజల్ని విజ్ఞప్తి చేయడానికి బదులు.. తానే ముఖ్యమంత్రిగా వస్తానని చంద్రబాబు అనడమేంటి? అని సజ్జల రామకృష్ణా ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజలు తనకు బాకీ ఉన్నారని ఆయన అనుకుంటున్నారా? అని నిలదీశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే‌.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి? అని సజ్జల నిలదీశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Sajjala ramakrishna reddy, Vijayasai reddy, Ycp

ఉత్తమ కథలు