KURNOOL WOMEN SI RUDE BEHAVIOR ON AGNANAVAADI TEACHER IN KURNOOL DISTRICT NGS
SI Rude Behavior: అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ జులుం.. నడుంపై చేయి వేసి మాట్లాడిందని ఫైర్
అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ జులుం
SI Rude Behaviour: ఎంత ధైర్యం.. నా ముందే నడుంపై చేయి వేసి మాట్లాడుతావా అంటూ అంగన్ వాడీ టీచర్ పై ఓ మహిళా ఎస్ఐ జులుం ప్రదర్శించింది. ఏం తప్పు చేయాని తాను ఎందుకు పోలీస్ స్టేషన్ కు రావాలి అని ప్రశ్నించిన పాపానికి అంగన్ వాడీపై ఇలా మహిళా ఎస్ఐ తన అధికారం ప్రదర్శించే ప్రయత్నం చేసింది.
SI Rude Behaviour: తన ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడ్డ ఓ అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ (Women SI) జులం ప్రదర్శించింది. ఎంత అహంకారం.. ఎదురుగా ఉన్నది ఎవరు అనుకుంటున్నావే.. పోలీస్‌నే ప్రశ్నించే గొంతు ఉందా..? పద పోలీస్టేషన్ కు అంటూ మహిళా ఎస్ఐ జులం ప్రదర్శించింది. అయితే తాను ఎందుకు రావాలి.. అంగన్ వాడీ టీచర్ (Teacher)ఎదురు ప్రశ్నించింది. అయితే అక్కడే ఉన్న మగ పోలీసులు ఏదో తింటూ.. ఏమీ తప్పు చేయకపోయినా స్టేషన్ రావాలి అంటూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశారు. సినిమా స్టైల్లో పోలీసుల స్టైల్లో బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఓ అంగన్ వాడీ వర్కర్ పట్ల ఎస్ఐ ఇలా వ్యవహరించడం తప్పు కాదా? వెంటనే ఆమెను సస్పండ్ చేయాలని ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఆమె తండ్రిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లి నిర్భందించడం దారుణమన్నారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లా (Kurnool District)లోని కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది.
కొత్తపల్లి ఎస్ఐ ముబీనా.. దళిత మహిళ అయిన అంగన్ వాడీ టీచర్ హరితపై విరుచుకపడింది. తాను ఏం తప్పు చేశానని.. ఎందుకు పోలీస్ స్టేషన్ కు రావాలని ఆ టీచర్ ప్రశ్నించడానికి పోలీసులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో పోలీసులనే ప్రశ్నించే అంత దమ్ము ఉందా.. అయితే తో రా అంటూ ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు తన ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడుతావా? కళ్లు నెత్తికెక్కాయా ? ఎవరితో మాట్లాడుతున్నావో కనబడడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ..? జీపు ఎక్కాలని హుకుం జారీ చేసింది ఎస్ఐ. స్టేషన్ కు వెళ్లిన తర్వాత.. అన్నీ అక్కడే అర్థమవుతాయని ఎస్ఐ ముబీనా తాజ్ హెచ్చరించింది.
అక్కడ పోలీసుల జులుం ప్రజలకు తెలియాలానే ఉద్దేశంతో.. సెల్ లో వీడియో తీస్తున్న వ్యక్తిని కూడా తీసుకరావాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించింది. ఇదేమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన హరిత తండ్రిని సైతం స్టేషన్ కు తీసుకెళ్లి నిర్భందించారు. అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంగన్ వాడి టీచర్ అయిన హరితను మానసిక ఒత్తిడికి గురి చేసి.. అవమాన పరిచారని వెల్లడిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు ఇవ్వలేదని, దారుణంగా ప్రవర్తించిన ఎస్ఐ ముబీనా తాజ్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.