Home /News /andhra-pradesh /

KURNOOL WOMEN BRUTALLY MURDERED BY THE KILLERS AT BANAGANAPALLI NANDYAL DISTRICT KNL NJ ABH

Kurnool: అర్ధరాత్రి మహిళపై ఘోరం.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు.. కన్నకొడుకే అలా..

హత్యకు గురైన లక్ష్మి చెన్నమ్మ 

హత్యకు గురైన లక్ష్మి చెన్నమ్మ 

కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళ దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి తమ్మడ పల్లె నుండి కొడుకుతో పాటు ఆటోలో బనగానపల్లెకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లి హత్యకు గురైన ఈ కేసులో పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali Krishna, News 18, Kurnool

    Kurnool; కర్నూలు జిల్లా బనగానపల్లెలో మహిళ దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి తమ్మడ పల్లె నుండి కొడుకుతో పాటు ఆటోలో బనగానపల్లెకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తల్లి హత్యకు గురైన ఈ కేసులో పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకున్నారు.దేశవ్యాప్తంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఓ మహిళను అర్ధరాత్రి దారుణ హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అమానవీయ ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం తమ్మడపల్లెలో జరిగింది. లక్ష్మీ చెన్నమ్మ అనే 45ఏళ్ల మహిళను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగుల బెట్టిన సంఘటన కలకలం రేకెత్తిస్తోంది.

    వేములపాడు(vemulawada) గ్రామానికి చెందిన లక్ష్మీ చెన్నమ్మ అనే మహిళకు గత 15 సంవత్సరాల క్రితం భర్త మృతి చెందడంతో పుట్టింట్లోనే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేంది. బనగానపల్లెలో తన వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని, తమ్మడ పల్లె గ్రామంలో తల్లి, చెల్లెలును ఆటోలో దింపి, అర్ధరాత్రి కొడుకుతో పాటు తమ్మడ పల్లె నుండి వేములపాడు గ్రామానికి బయలుదేరింది.

    తమ్మడపల్లె గ్రామ శివారు ప్రాంతంలో కొందరు దుండగులు ఆటోను అడ్డగించి, తమపై దాడి చేసి తన తల్లిని హత్య చేశారని చెన్నమ్మ కుమారుడు మధు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటా హుటహుటిన ఘటనాస్థలాన్ని చేరుకొని పరిశీలించారు.

    మహిళపై దాడి చేసి పెట్రోల్ పోసి తగలపెట్టడంతో, కుప్పకూలి కొనఊపిరితో కొట్టు మిట్టాడుతున్న బాధిత మహిళను పోలీసులు వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శరీరం సగానికిపైగా కాలిపోవడంతో మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.

    మహిళ దారుణ హత్య ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు, మృతురాలి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు లక్ష్మీ చేన్నమ్మ హత్యలో కొడుకు మధుపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో మృతురాలి కుమారుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    Read this also; Mulugu: కటాక్షపూర్ చెరువు కష్టాలు…ఇప్పటికైనా కటాక్షపురం చెరువుకు కటాక్షం దొరికేనా

    మృతురాలు చెన్నమ్మ ప్రవర్తన కొడుకు మధుకు ఏమాత్రం నచ్చకపోవడంతో గత కొంత కాలం గా తల్లి కొడుకుల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం, తల్లి ప్రవర్తన పట్ల విసిగిపోయిన కొడుకు, తల్లిని పథకం ప్రకారం హత్య చేసేందుకు కుట్ర చేసి ఉండవచ్చు అనే అనుమానాలు ఆమె కుటుంబసభ్యుల్లోనూ, గ్రామస్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. అసలు నిందితులు ఎవరో పోలీసులు విచారణలో వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు