హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు హత్య... కారణం ఇదే..!

Kurnool: ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు హత్య... కారణం ఇదే..!

X
అమానుష

అమానుష ఘటన

Andhra Pradesh: మద్యానికి బానిసై కొందరూ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. మద్యం మత్తులో చేసే పనుల వల్ల ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల కుటుంబంలోని పిల్లలు అనాథలవుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్న మందు బాబుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

(T. Murali Krishna, News18, Kurnool)

మద్యానికి బానిసై కొందరూ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. మద్యం మత్తులో చేసే పనుల వల్ల ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. దీనివల్ల కుటుంబంలోని పిల్లలు అనాథలవుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్న మందు బాబుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి సంఘటనే తాజాగా కర్నూలు జిల్లా పెద్దకడబురులో చోటుచేసుకుంది. మద్యానికి బానిసై తన భార్యను, అత్తను అతి కిరాతకంగా హతమారచ్చాడు ఓ ప్రబుద్ధుడు.

మద్యం మత్తులో భార్యను, అత్తను వేట కొడవలితో నాగరాజ్ అనే వ్యక్తి అతి కిరాతకంగా నరికి చంపి హత్య చేశాడు... ఈ ఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం జలవడా గ్రామంలోని చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కరెంటు నాగరాజ్ నిత్యం మద్యం కోసంభార్య శాంతినిడబ్బులు ఇవ్వాలని వేధించేవాడు.

ఏ పనులు చేయక సోమరితనంగా తిరిగేవాడు. అదనపు కట్నంభార్యనువేధించేవాడు. తన భార్యకు రావలసిన ఆస్తిని ఇవ్వాలని అత్తతో గొడవ పడేవాడు. ఆస్తి ఇవ్వక పోవడంతో హత మార్చేందుకు పధకం వేసి నరకి చంపాడు. భార్య శాంతి స్కూల్లో మద్యాహ్నం భోజనం పధకం వంట నిర్వాహకురాలు. నిత్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని నిందితుడు నాగరాజు వేధించేవాడు. పలుమార్లు పోలీసులు భర్తకు కౌన్సిలింగ్ ఇచ్చారు. నిన్న అప్పు చేసి కొత్త బైక్ కొనడంతో భార్య, అత్త, నిందితుడు నాగరాజుతో గొడవ పడ్డారు.

మద్యం మైకులో అర్ధరాత్రి పడుకున్న భార్య శాంతిని అత్త భీమక్కను అతి కిరాతకంగా వేట కొడవలితో నరికి చంపి పరారి అయ్యాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. నిందితుడు పరారీలో ఉండడంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానంతో హత్య చేశాడా లేదా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ముగ్గురు సంతానం. ఇద్దరు హత్యకు గురి కావడం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు