Home /News /andhra-pradesh /

KURNOOL WOMAN SHOCKED VILLAGERS AFTER SHE CREATED HIGH DRAMA THAT SHE GONE MISSING IN A POND IN KURNOOL DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Kurnool Woman: మునిగిపోయిందనుకొని నీళ్లలో గాలిస్తుంటే.. కూల్ గా బస్సుదిగింది.. గ్రామస్తుల ముఖచిత్రాలు ఇలా..!

రసూల్ బీ (ఫైల్)

రసూల్ బీ (ఫైల్)

Kurnool Woman: మూఢనమ్మకాలు, భయాలు మనిషిని వింతవింత పనులన్నీ చేయిస్తాయి. ఒక్కోసారి వారితో పాటు చుక్కుపక్కలవారిని కూడా పరుగులు పెట్టిస్తాయి. అలా ఓ మహిళ తనకున్న పిచ్చినమ్మకంతో జనాలకి పిచ్చెక్కించింది.

    మూఢనమ్మకాలు, భయాలు మనిషిని వింతవింత పనులన్నీ చేయిస్తాయి. ఒక్కోసారి వారితో పాటు చుక్కుపక్కలవారిని కూడా పరుగులు పెట్టిస్తాయి. అలా ఓ మహిళ తనకున్న పిచ్చినమ్మకంతో జనాలకి పిచ్చెక్కించింది. అంతా ఏదో అయిపోయిందనుకొని ఆమె కోసం వెతుకుతుంటే సాఫీగా బస్సు దిగి ఇంటికొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డి పల్లెకు చెందిన రసూల్ బీకి భర్త, కుమార్తెతో కలిసి గ్రామంలో ఉంటోంది. ఆమెతో పాటు కుమార్తె, బంధువులు, చుట్టుపక్కల మహిళలతో కలిసి పది మంది ఈనెల 22న తుమ్మలపెంట సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద పూజలు చేశారు. అక్కడి నుంచి గొర్విమానుపల్లె సమీపంలోని లొక్కిగుండంకు వెళ్లారు. రామేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నీటి గుండంలోని నీటిలో దిగారు. అంతా సవ్యంగా సాగుతుండగా ఒక్కసారిగా కేకలు వినిపించాయి.

    రసూల్‌బీ గుండంలో గల్లంతైందంటూ ఆమె కుమార్తెతో పాటు తోటి మహిళలంతా కేకలు పెట్టారు. నీటిలోనే మునిగిపోయిందని తాము చూశామని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఆలయ పూజారితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వచ్చిన జనం ఆమె ఆచూకీ కోసం గాలించారు. చీకటిపడినా రసూల్ బీ ఆచూకీ కనిపించకపోవడంతో రాత్రంతా అక్కడే ఉండి గాలించినా దొరకలేదు. తర్వాత రోజు జనరేటర్, మోటర్ల సాయంతో నీటిని బయటకు పంపింగ్ చేశారు. నీటి మట్టం మూడడుగుల లోతులో ఉండటంతో యువకులంతా నీటిలో దిగి గాలించారు. అయినా ఆమె దొరకలేదు. ఆ తర్వాతి రోజు కూడా రసూల్ బీ గానీ ఆమె మృతదేహం కానీ లభ్యం కాలేదు.

    ఇది చదవండి: సినిమా డెరెక్టర్లు కూడా వీళ్ల తెలివి ముందు దిగదుడుపే.! ఏం స్కెచ్ వేశార్రా నాయనా..?


    ఐతే మూడు రోజుల పాటు స్థానికులంతా ఆమెను గాలిస్తున్నారు. బంధువులంతా ఆమె ఆచూకీ దొరుకుతుందేమోనని ఉత్కంఠగా ఎదరు చూస్తుంటే ఆమె మాత్రం కూల్ గా బస్సు దిగి ఇంట్లోకి వెళ్లింది. దీంతో అక్కడున్నవారి ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో గ్రామస్తులకు పిచ్చకోపం లేచి ఇంటికి వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆమె మూడు రోజుల పాటు అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అక్క, బావ ఇంటివద్ద ఉన్నట్లు చెప్పింది. పోలీసులు రసూల్ బీతో పాటు ఆమె అక్క, బావని కూడా అదుపులోకి తీసుకున్నారు.

    ఇది చదవండి: ప్రాణం తీసిన శోభనం.. ఫస్ట్ నైట్ భయంతో యువకుడు ఏం చేశాడంటే..!


    విచారణలో ఆమె చెప్పిన సమాధానం విని అంతా షాక్ కు గురయ్యారు. తన భర్త, కుమార్తెకు ప్రాణగండం ఉందని.. మూడు రోజుల పాటు కనిపించకుండా పోతే గండం తప్పిపోతుందనే నమ్మకంతోనే ఇలా చేసినట్లు చెప్పింది. అంతేకాదు తన కోసం వెతుకుతున్న పరిణామాలను తెలుసుకుంటూనే ఉంది. చివరకి మేటర్ సీరియస్ కావడంతో ఇంటికి తిరిగొచ్చేసింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు