Home /News /andhra-pradesh /

KURNOOL WOMAN KILLED HER SISTER AFTER THEY HAVING SAME HUSBAND IN NANDAL DISTRICT ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Shocking: ఒకే వ్యక్తిని పెళ్లాడిన అక్కాచెల్లెళ్లు.. ఓ రోజు చెల్లి మిస్సింగ్.. అరా తీస్తే షాకింగ్ నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shocking Mystery : వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలసి పెరిగారు. తల్లిదండ్రులు కూడా అన్నింట్లో సమానంగానే చూశారు. చిన్నప్పటి నుంచి అన్నింటినీ పంచుకున్న అక్కాచెల్లెళ్లు.. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఓ రోజు చెల్లెలు కనిపించకుండా పోయింది.

ఇంకా చదవండి ...
    వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి కలిసిమెలసి పెరిగారు. తల్లిదండ్రులు కూడా అన్నింట్లో సమానంగానే చూశారు. చిన్నప్పటి నుంచి అన్నింటినీ పంచుకున్న అక్కాచెల్లెళ్లు.. ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఉన్నట్లుండి ఓ రోజు చెల్లెలు కనిపించకుండా పోయింది. మిస్సింగ్ కేసును విచారించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి. ఎవరూ ఊహించని విధంగా నిందుతులు వెలుగులోకి వచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నంద్యాల జిల్లా (Nandyal District) కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ కు జానకమ్మ, తిరుమలేశ్వరి అనే ఇద్దరు భార్యలున్నారు. ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరూ ఒకే జనార్ధన్ ను పెళ్లాడారు. ఐతే కొన్నాళ్లుగా వీరి జీవితం సాఫీగానే సాగింది. కానీ అక్క మెదడులో ఓ దురాలోచన వచ్చింది.

    తిరుమలేశ్వరికి వచ్చే ఆస్తివాటాపై జానకమ్మ కన్నుపడింది. ఆమెకు పిల్లలు లేకపోవడంతో చెల్లెలి వాటాగా వచ్చే ఆస్తి కోసం కన్నింగ్ ప్లాన్ వేసింది. ఈనెల 25న తిరుమలేశ్వరికి భోజనంలో కుక్కలమందు కలిపిపెట్టారు. అన్నం తిన్న కాసేపటికే ఆమె గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. అనంతరం మృతదేహాన్ని టీఎవీఎస్ ఎక్స్ఎల్ బండిపై తీసుకెల్లి నల్లమల అటవీ ప్రాంతంలోని రోళ్లపెంట సమీపంలో పడేశారు. ఐతే తిరుమలేశ్వరి కనిపించకపోవడంతో తల్లి తాటికొండ లక్ష్మీదేవి తన కుమార్తె కోసం ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    ఇది చదవండి: ప్రేమించినవాడే సర్వస్వం అనుకుంది.. పెళ్లికి ముందు ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..


    వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త జనార్ధన్, అక్క జానకమ్మ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని ప్రశ్నించడంతో అసలు నిజం చెప్పారు. తిరుమలేశ్వరిని తామే హత్య చేసినట్లు అంగీకరించారు. డెడ్ బాడీని పడేసిన ప్రదేశాన్ని చూపించడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

    ఇది చదవండి: ఆమెకు ఒకేసారి ఇద్దరితో సీక్రెట్ ఎఫైర్.. మరో లవర్ తో కలిసి మర్డర్ స్కెచ్.. చివర్లో ట్విస్ట్..


    ఇటీవల గుంటూరు జిల్లా తెనాలి కూడా ఇలాంటి ఘటనే జరిగింది. రవి కిరణ్ యువకుడికి దీప్తీ అనే యువతితో పరిచయం ఉంది. ఐతే అప్పటికే దీప్తి లడ్డూనే రౌడీషీటర్ తో ఎఫైర్ ఉంది. రవి కిరణ్ విషయం లడ్డూకి తెలిస్తే తనను చంపేస్తాడని భావించిన దీప్తీ.. రవి కిరణ్ తనను వేధిస్తున్నాడి లడ్డూకి చెప్పింది. దీంతో ఆగ్రహించిన లడ్డూ.. దీప్తీతో రవికిరణ్ కు ఫోన్ చేయించి ఒంటరిగా తన ఇంటికి రప్పించాడు. అక్కడ అందరూ కలిసి రవికిరణ్ ను కొట్టి చంపి మృతదేహావన్ని కాలువలో పడేశారు. దీనిపై తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తర్వాత హత్య కేసుగా మార్చారు. దీప్తితో పాటు లడ్డూ, అతడి స్నేహితులను అరెస్ట్ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Kurnool, Murder

    తదుపరి వార్తలు