Murali Krishna, News18, Kurnool
కర్నూలు (Kurnool) నగరంలో స్థానిక గణేష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వినీల అను వివాహితను అదనపు కట్నం వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. వినీలను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసి ఆమె మరణానికి కారణమైన భర్త చిరంజీవి , అత్త శేషమ్మ, ఆడబిడ్డ ఆనందమ్మ, ఆడబిడ్డ భర్త గిడ్డయ్య వెంటనే అరెస్టు చేయాలని జిల్లాలోని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేశారు. నాగన్న (రిటైర్డ్ యస్.ఐ.) రెండవ కూతురు అయిన వినీలను కానిస్టేబుల్ చిరంజీవికి ఇచ్చి తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వివాహం అయిన కొద్ది నెలలు నుండే చిరంజీవి.. వినీలను అదనపు కట్నం తేవాలాంటూ వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు.
అయితే ఈ విషయంపై పలుమార్లు వివాహిత తన కుటుంబ సభ్యులకు తెలుపగా తన తండ్రినాగన్న రిటైర్డ్ అయితే వచ్చిన డబ్బులతో ఐదు లక్షల రూపాయలు చిరంజీవికి ఇచ్చి తన కూతురును బాగా చూసుకోమని కోరారు. ఇక నుండి తన కూతురును వేధించ వద్దని అల్లుడి కాళ్ళు పట్టుకుని మరీ ప్రాధేయపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటినుండి కొద్దిరోజులు వారు వినీలను బాగానే చూసుకున్నారు.
కానీ మరి కొద్దిరోజులు గడిచిన తరువాత చిరంజీవి మాత్రం వేధింపులు మానలేదని తెలిసింది. చివరకు వినీల చిరంజీవి వేధింపులు తట్టుకోలేకఅత్తగారింట్లోనే ఇంట్లో3వ తేదీ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. అయితే వినీల ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె భర్త, అత్తింటి వారు కలిసి తన కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రికరించి చెబుతున్నారని వధువు తండ్రి నాగన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంతో వరకట్న వేధింపుల నుండి రక్షణ కల్పించాల్సిన పోలీసులే మహిళలను వేధింపులకు గురి చేయడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులను చట్టప్రకారం శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వాటిపై కఠినమైన చర్యలు చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని తన కూతురికి జరిగిన అన్యాయం మరో ఆడబిడ్డకు జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News