హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool Woman: పట్టుమని పాతికేళ్లు లేవు.. పెళ్లిపేరుతో ముగ్గుర్ని మడతెట్టేసింది..!

Kurnool Woman: పట్టుమని పాతికేళ్లు లేవు.. పెళ్లిపేరుతో ముగ్గుర్ని మడతెట్టేసింది..!

శిరీష (ఫైల్)

శిరీష (ఫైల్)

Kurnool Woman: ఆమెకు 24ఏళ్లు. సాధారణంగా ఆ వయసులో ఉన్న యువతులకు పెద్దలు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లిచేస్తారు. కూతురి కాపురం చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ స్టోరీలో ఓ కిలేడీ మాత్రం గుండెలు తిసిన బంటు. పట్టుమని పాతికేళ్లు లేవుగానీ.. మగాళ్లను ఇట్టే మడతెట్టేస్తుంది.

ఇంకా చదవండి ...

ఆమెకు 24ఏళ్లు. సాధారణంగా ఆ వయసులో ఉన్న యువతులకు పెద్దలు ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లిచేస్తారు. కూతురి కాపురం చల్లగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ స్టోరీలో ఓ కిలేడీ మాత్రం గుండెలు తిసిన బంటు. పట్టుమని పాతికేళ్లు లేవుగానీ.. మగాళ్లను ఇట్టే మడతెట్టేస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకర్ని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మూడు ముళ్ల పేరుతో ముగ్గుర్నీ ముంచేసింది. ఆ కీలేడీకి.. తల్లి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) ప్రస్తుతం నంద్యాల జిల్లా నంద్యాల మండలం మిట్నాల గ్రామానికి చెందిన మేరమ్మ కుమార్తె శిరీషకు కొంతకాలం క్రితం అవుకుమండలం చెన్నంపల్లెకు చెందిన మల్లికార్జున అనే వ్యక్తితో పెళ్లైంది.

కొన్నాళ్లకే భర్తకు దూరంగా వచ్చేసింది. అతడికి విడాకులు ఇవ్వకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. బేతంచర్ల మండలం రంగాపురంకు చెందిన మహేశ్వర్ రెడ్డిని మూడో పెళ్లి చేసుకుంది. ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మహేశ్వర్ రెడ్డికి ఇది రెండో పెళ్లి కావడంతో శిరీష గురించి పెద్దగా ఎంక్వైరీ చేయకుండానే తాళికట్టాడు.

ఇది చదవండి: ఈ సీన్ చూస్తే మందుబాబులు గుండెలు బాదుకుంటారు.., అలాగే ఉంటది మరి..!


ఐతే పెళ్లికి ముందే శిరీష.. తనకు రక్షణగా ఐదు లక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేయాలనే కండిషన్ పెట్టింది. దీంతో అతడు పెళ్లికి ముందే ఐదు లక్షలు డిపాజిట్ చేశాడు. ఐతే పెళ్లైన తర్వాత కూడా శిరీష తల్లి మేరమ్మ.. అల్లుడి ఇంటికి వస్తూ తన కుమార్తెను అత్తారింట్లో ఉంచాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుండేది. అలాగే ఆస్తి కూడా రాయాలని ఒత్తిడి చేసేది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి.. శిరీష గురించి ఆరా తీయగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమెకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. ఇది మూడోపెళ్లని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది చదవండి: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం... కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..


గతంలో విశాఖపట్నంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పెళ్లికి ముందే ప్రియుడితో హద్దులు దాటిన మహిళ.. సరిగ్గా పెళ్లైన మూడు రోజులకో గర్భవతి అయింది. దీంతో భర్త వదిలేయడంతో ప్రియుడితోనే కాపురం పెట్టింది. పాప పుట్టిన తర్వాత ప్రియుడికి తమ్ముడు వరసయ్యే జవాన్ ను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంది. అతడి నుంచి విడతలవారీగా రూ.50 లక్షల నగదు, బంగారం తీసుకుంది. ఉద్యోగం పేరుతో లక్నో నుంచి విశాఖ వచ్చేసి.. సీక్రెట్ గా మరో యువకుడ్ని పెళ్లిచేసుకుంది. అసలు నిజం తెలిసిన జవాను.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మాయలేడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

First published:

Tags: Andhra Pradesh, Cheating, Kurnool

ఉత్తమ కథలు